
తన అభిమానులకు డబుల్ ఖుషీ అయ్యేలా.. రెండు గుడ్ న్యూస్ లను అందించింది సమంత. మా ఇంటి బంగారంతో ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లో భారీ సక్సెస్, మరోవైపు పర్సనల్ లైఫ్‌లో ఎవరూ ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన సామ్..
చాలా కాలం తర్వాత ఆనందంతో పొంగిపోయింది. సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కృంగిపోయిన సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి, పెళ్లాడి హ్యాపీగా జీవిస్తోంది.
రీసెంట్ గా మా ఇంటిబంగారు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. రీసెంట్ గా సక్సెస్ మీట్ కూడా పెట్టింది. ఈ సక్సెస్ మీట్లో సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మా ఇంటి బంగారం సినిమాలో సమంత తన ఆన్ స్క్రీన్ భర్త అనిరుధ్ క్యారెక్టర్‌ను ముద్దుగా ‘’అని'' అని పిలుస్తుంది. మరి నిజ జీవితంలో తన భర్త రాజ్ ను ముద్దుగా ఏమనిపిలుస్తుంది? రాజ్ నిక్ నేమ్ ఏంటి అనే ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది.
యాంకర్.. సమంతను సరదాగా ప్రశ్నించారు. దీనికి సమంత సిగ్గుపడుతూ.. ఎంతో మురిసిపోతూ సమాధానమిచ్చింది. "రాజ్ వాళ్ల అమ్మగారు, చెల్లి ఇంట్లో తనను ఎంతో ప్రేమగా 'బాబు' అని పిలుస్తారు. వాళ్లలాగే నేను కూడా రాజ్‌ను ఎప్పుడూ 'బాబు' అని పిలుస్తుంటాను" అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సినిమా సక్సెస్‌తో తో పాటు అభిమానులకు సమంత మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లో జరిగిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్ ఈవెంట్ లో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. తాను ప్రెగ్నెంట్ అని, తన జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నారని సంతోషంగా వెల్లడించింది. ఈ వార్త విన్న వెంటనే అక్కడున్న వారంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఒక్క ప్రకటనతో ఆమె అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.
దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత మా ఇంటి బంగారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సమంత. ఈసినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రికార్డుల వర్షం కురిపిస్తోంది. సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.