మన ఇంటికి నిజంగానే శాపం తగిలిందేమో అన్నయ్య అని పెద్దితో కేశవ అంటాడు. మునీశ్వరులు ఇచ్చేది శాపం అవుతుంది.. ఇలా నోటికి ఎంతొస్తే అంత వాగే వాళ్లు ఇచ్చేది శాపం కాదు.. మన నాన్న ఓ నింద మోస్తూనే ఉన్నాడు..
ఇప్పుడు చక్రి తన తలరాతను తానే రాసుకున్నాడు.. నిజాయితీగానే ప్రేమించాడు.. కానీ ఆ ప్రేమను సరిగ్గా వ్యక్త పర్చలేదు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుని జీవితానికి సరిపడా బాధను నేను మోస్తున్నాను.. నాలా మీరు ఎవ్వరూ కాకూడదు.. ప్రేమిస్తే మన ప్రేమను అర్థమయ్యేలా చెప్పాలి.. చర్యలతో చెప్పాలి అని పెద్ది అంటాడు. ఇక శైలుకి తన ప్రేమను చెప్పాలని రాత్రి పూటే బయల్దేరుతాడు కేశవ. ఈ ముంగీస గాడేంటి ఇంకా రావడం లేదు అని ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంటుంది శైలు. ఈ చోటు గాడు చెప్తే ఫీలై ఉంటాడు.. కానీ ఇంకా రావడం లేదేంటి అని శైలు అనుకుంటుంది. ఈ బుస్సు ఉండే పుట్ట ఎక్కడుంది.. ఒక్కసారి బుస్సు కొట్టవే బుస్సు.. ఎక్కడున్నావో అర్థం కావడం లేదు అని కేశవ అనుకుంటాడు. దీంతో కేశవని చూసి శైలు తెగ సంబరపడుతుంది.నీతో మాట్లాడేందుకు వచ్చా.. ఇంటి ముందున్న చెత్తంతా ఊడ్చేసి బయట పారబోసేందుకు వచ్చినట్టుగా వస్తుంది శైలు. తన బైక్ ఏదో రిపేర్ అయినట్టుగా రిపేర్ చేస్తూ నటిస్తుంటాడు కేశవ. చెత్త తీసుకుపోయేందుకు వచ్చావా? అని కేశవకు శైలు కౌంటర్ వేస్తాడు. నీ ఇంటికి ఏ మాత్రం రాలేదు లే.. అని అంటాడు. నీతో మాట్లాడేందుకు వచ్చా.. ఒకటి అడుగుతా నిజం చెప్పు.. చోటు ఏదో చెప్పాడు.. నీ ఇంట్లో ఏదో అవుతుందట.. అని కేశవ అంటాడు. వంట అవుతుందట.. అని శైలు కౌంటర్ వేస్తుంది. పెళ్లి చూపులు అయ్యాయ్ అంట.. అని కేశవ అంటాడు. అవును అని శైలు అంటుంది.నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పరా అయితే నీకేంట్రా అని శైలు అంటుంది. నీకు నచ్చాడా? నీ నోరు తెరిస్తే వాడు పారిపోతాడు అని శైలుని ఏడ్పిస్తాడు కేశవ. మరి నువ్వు ఇటు ఎందుకు వచ్చావ్.. నీకు కూడా ఫీలింగ్ ఉన్నాయ్ అని ఒప్పుకోరా బండోడా.. నీ మేల్ ఈగో తగిలెయ్యా.. ఇంకెప్పుడు చెప్తావ్.. నాకు పెళ్లి అయిన తరువాత చెప్తావా? నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పరా అని కేశవతో శైలు అంటుంది. ప్రేమనా? నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావ్.. బుస్సుని ముంగిస ప్రేమిస్తుందా? అని కేశవ అంటాడు. అయితే చావరా.. ఎందుకు వచ్చావ్ అని ఆ చెత్త అంతా కేశవ మీద పడేసి వెళ్తుంది శైలు.మర్యాద పోయిందా? ఏక వచనంతోనే నీకు ఈ హాస్టల్లో ఉండటం నచ్చడం లేదా? ఏదో ఉండాలని ఉంటున్నట్టుగా ఉన్నావ్ అని మహాతో దివ్య అంటుంది. ఇంతలో సారీ అంటూ బెలూన్లను హాస్టల్ ముందు ఎగిరేస్తుంటాడు చక్రి. దీంతో కోపంగా కిందకు వస్తుంది మహా. ఏయ్ ఏంటిది అని ఫైర్ అవుతుంది. ఏంటిది.. అని మహా అంటుంది. సారీ.. అని చక్రి అంటాడు. నేను చచ్చే వరకు నిన్ను క్షమించను అని మహా అంటే.. చచ్చే వరకు అడుగుతూనే ఉంటాను అని చక్రి అంటాడు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? చూడు అని ఇలా ఏకవచనంతో మాట్లాడుతుంది. మర్యాద పోయిందా? ఏక వచనంతోనే మాట్లాడుతున్నారు అని చక్రి అంటాడు.ఇక్కడ మర్యాదగా బతకాలని మర్యాద ఎప్పుడో పోయింది.. నీకు మర్యాద ఇవ్వను.. జీవితంలో నిన్ను మీరు అని పిలవను.. ఇన్నాళ్లు నీ నిజ స్వరూపం తెలీక ఇన్నాళ్లూ ఉన్నాను.. తెలిశాక బయటకు వచ్చాను.. ఆఫీసులో నా పరువు తీశారు.. ఇప్పుడు హాస్టల్లో కూడా పరువు తీస్తున్నారు.. మన మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు.. ముందు ఆ బెలూన్స్ దించండి.. అని మహా అంటుంది. నేనేమీ కావాలని చేయలేదు అని చక్రి అంటే.. నేను ఇక్కడ మర్యాదగా బతకాలని అనుకుంటున్నాను.. వెళ్లక పోతే పెద్దికి ఫోన్ చేస్తా.. అని మహా అంటుంది. నేను ఇక్కడ సెక్యూరిటీ జాబ్ చేస్తే ఏం చేస్తారు.. అని చక్రి అంటే.. అందరితో దెబ్బలు తింటారని భయపెడుతుంది మహా. దీంతో చక్రి వెళ్లిపోతాడు.మన మనసు మనకు చెబుతుంది.. సారీ అని చెప్పినా వినిపించుకోలేదు.. ఇన్ని చేస్తుంటే.. అది ప్రేమ అని గ్రహించదా?.. నా మీద ప్రేమ ఉందని అనిపిస్తుంది.. ఇంకొన్ని సార్లు దూరం పెడుతుంది అని మహా గురించి కేశవతో చక్రి చెబుతుంటాడు. కానీ అవన్నీ శైలుకి వర్తించుకుని ఊహించుకుంటాడు కేశవ. ఆమె నిన్ను ప్రేమిస్తుందని నీకు ఎలా తెలుస్తుంది రా అని కేశవ అంటే.. మన మనసు మనకు చెబుతుంది కదరా అని చక్రి అంటాడు. ఆమె అందంగా ఉండటం వల్లే నీకు అలా అనిపిస్తుందేమో అని కేశవ అంటే.. మన జీవితానికి సరిపోయే వ్యక్తి అని ప్రకృతే చెబుతుంది.. అనుకోకుండా కలిసింది.. నా కార్ ఎక్కి వెళ్లింది.. అని చక్రి చెప్పడంతో శైలుతో తొలి పరిచయం గురించి కేశవ గుర్తు చేసుకుంటాడు.కేశవ మనసులో మాత్రం శైలునే.. ఇక చక్రి తన ప్రేమ సంగతులు చెబుతుంటే.. కేశవ తనకు, శైలుకి జరిగిన ఇన్సిడెంట్స్ను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్లీ మళ్లీ కలుస్తున్నామంటే.. ఏదో రాసి పెట్టి ఉన్నట్టే కదా.. అని చక్రి అంటే.. కేశవ మాత్రం శైలు గురించే ఆలోచిస్తుంటాడు. తనకు ఏమైనా అవుతుందంటే తట్టుకోలేం.. ప్రాణం అడ్డు పెట్టి కాపాడుకుంటాం అని చక్రి అంటే.. శైలుని కాపాడిన విషయాన్ని కేశవ గుర్తు తెచ్చుకుంటాడు. ప్రేమను బయట పెట్టుకోవడానికి, మనసులు కలవడానికి ఏదో అడ్డు పడుతుంది.. ఎలాగైనా సరే మహాలక్ష్మీని మన ఇంటికి తీసుకుని రావాలని చక్రి చెప్పి వెళ్లిపోతాడు. ఇక కేశవ మనసులో మాత్రం శైలునే తిరుగుతుంటుంది.హాస్టల్లో లేడీస్ ఆరా.. అంత రొమాంటిక్‌గా, స్వీట్‌గా, క్యూట్‌గా సారీ చెప్పాడు.. ఎవరతను.. అని మహాని హాస్టల్లోని అమ్మాయిలంతా అడుగుతారు. ఏం లేదు అని మహా అంటుంది. చూడు సువర్ణ సుందరి.. ఈ కాలంలో అబ్బాయిలు మనం ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే.. వేరే అమ్మాయితో కనెక్ట్ అవుతున్నారు.. ఆ అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు.. క్షమించు.. మళ్లీ పుడతామా ఏంటి? అని అంటారు. దీంతో మహాకి కోపం వచ్చి.. అందరూ వెళ్లిపోండి అని అరిచేస్తుంది. నిజంగానే అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? వేధిస్తున్నాడా? అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చావా? అని మహాని దివ్య అడుగుతుంది. అలాంటిదేమీ లేదు.. అని మహా గట్టిగా సమాధానం ఇస్తుంది.కన్నాకి జ్వరం.. కన్నాకి జ్వరం వచ్చిందని పెద్ది పనికి వెళ్లకుండా ఉండిపోదామని అనుకుంటాడు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చక్రి అంటాడు. నీకు మీ వదిన లేదనే బెంగతో జ్వరం వచ్చింది కదా.. మీ వదినకి ఫోన్ చేయరా.. కనీసం వీడియో కాల్ అయినా చేయరా అని కన్నాతో అంటాడు చక్రి. నాకు తెలుసు.. దీని కోసమే కదా నువ్వు నన్ను చూసుకుంటాను అని అన్నావ్.. నేను వదినకు ఫోన్ చేయను.. రమ్మని పిలవను.. కంగారు పెట్టను అని కన్నా అంటాడు. టీ కావాలా? జ్యూస్ కావాలా? అని చక్రి మాట మార్చేస్తాడు. నాకేం వద్దు.. కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు అని కన్నా అంటాడు. దీంతో చక్రి వెళ్లిపోతాడు.ప్రేమ ఉంటే చూస్తావ్.. షాపులో శైలు గురించి కేశవ ఆలోచిస్తుంటాడు. చోటు వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావ్ అన్నా అని అన్నాడు. శైలు గురించే ఆలోచిస్తున్నారా.. రాత్రి ఆమె ఇంటికి వెళ్లా.. ఆమె నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పింది.. అది నన్ను ప్రేమిస్తుందట.. నాకు ఎందుకు అర్థం కాలేదు.. మరి నేను ప్రేమిస్తున్నానా? లేదా? అది నాకు ఎలా తెలుస్తుంది.. అని కేశవ అంటాడు. అయితే ఆ అమ్మాయికి ఇది లాస్ట్ డే.. ఇలానే వెళ్తుంది.. నువ్వు చూడకుండా ఉండు.. అలా ఉంటే నీకు ఆమె మీద ప్రేమ లేనట్టే.. చూడాలనిపిస్తే.. ప్రేమ ఉన్నట్టే అని చోటు గాడు సలహా ఇస్తాడు.కన్నా గుర్తుకు వస్తున్నాడు.. భన్సీకి తన సమస్య గురించి, కన్నాకి జ్వరం వచ్చిన సంగతి గురించి చెబుతాడు పెద్ది. మరి మహాకి ఫోన్ చేసి ఓసారి వచ్చి చూసి వెళ్లమను అన్నా అని సలహా ఇస్తాడు. దీంతో మహాకి ఫోన్ చేస్తాడు పెద్ది. ఆ టైంలో ఫైల్ తీసుకుని విక్కీ దగ్గరకు వెళ్తుంది మహా. సమస్య ఏంటి? చెప్పు అని విక్కీ అడుగుతాడు. ఆ టైంలోనే మహాకి పెద్ది నుంచి ఫోన్ వస్తుంది. ఎలా ఉన్నావ్.. అమ్మా.. హాస్టల్లో అంతా బాగానే ఉందా? అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది పెద్ది.. మీరే గుర్తుకు వస్తున్నారు.. కన్నా అయితే గంటగంటలకి గుర్తుకు వస్తున్నాడు అని.. రావాలని ఉంది.. కానీ భయంగా ఉంది అని మహా అంటుంది.నీ పట్ల తప్పుగా ప్రవర్తించాం.. ఇలాంటి టైంలో నేను రమ్మని పిలిస్తే బాగోదు అని కన్నాకి జ్వరం వచ్చిన సంగతి మహాకి పెద్ది చెప్పడు. నీకు ఏ అవసరం పడినా ఫోన్ చెయ్యి.. ఇక్కడి నుంచి వెళ్లిపోయావ్ కదా అని.. అడగకుండా ఉండకు అని అంటాడు పెద్ది. సారీ పెద్ది మీ అందరినీ సడెన్‌గా వదిలేసి వచ్చా, ఇబ్బంది పెడుతున్నా అని మహా అంటుంది. అలా అంటే మేమే నీకు వందల సార్లు సారీ చెప్పాలి.. మేమే నీ పట్ల తప్పుగా ప్రవర్తించాం.. అని పెద్ది అంటాడు. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు.. గౌరవం తగ్గలేదు అని మహా అంటుంది. జాగ్రత్తగా ఉండు.. టైంకి తిను.. అని ఫోన్ పెట్టేస్తాడు పెద్ది. ఇంకో వైపు ఓంకారేశ్వర్ దగ్గరకు చక్రి వెళ్తాడు. నా ఐడియా పాటించావ్.. సక్సెస్ అయి ఉంటావ్ అని ఓంకారేశ్వర్ అంటాడు.