పాలకూర, మునగాకు, మెంతికూర, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
తద్వారా ఊపిరితిత్తులను బలంగా ఉంచుతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
నిమ్మ, బత్తాయి, గ్రేప్ ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శ్వాస సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి ఊపిరితిత్తులను కాపాడుతాయి. లంగ్స్ హెల్త్ బాగుండేలా చూస్తాయి.
స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, స్ట్రాబెర్రీ లాంటి బెర్రీ పండ్లలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి ఊపిరితిత్తులను కాపాడుతాయి. లంగ్స్ బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజల్లో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి.
క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంంటాయి. ఇవి ఊపిరితిత్తుల కణజాలాన్ని రిపేర్ చేస్తాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడి, గాలి కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుతాయి.
నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోస, తర్భూజ వంటివి తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే బాడీ డీటాక్స్ అవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అల్లం, వెల్లుల్లిలో యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాస నాళాలను శుభ్రంగా ఉంచి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. లంగ్స్ పాడవుకుండా కాపాడుతాయి.
ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. లంగ్స్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.