
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక అధికార కూటమికి చెందిన కీలక నేతల ‘ల్యాండ్ మాఫియా’ ఒత్తిళ్లు ఉన్నాయంటూ వైసీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు...
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక అధికార కూటమికి చెందిన కీలక నేతల ‘ల్యాండ్ మాఫియా’ ఒత్తిళ్లు ఉన్నాయంటూ వైసీపీ సీనియర్ నేత, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు పూర్తిగా చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా మారిపోయారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీస్ హౌసింగ్ అండ్ లీగల్ సర్కిల్స్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.జగ్గయ్యపేట పరిధిలోని ఒక భారీ ల్యాండ్ డీల్ వివాదంలో కూటమికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. వారి ఆదేశాల మేరకే సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ డైరెక్షన్లో... సీఐ నాగరాజు మరికొందరు సిబ్బంది కలిసి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని అతి కిరాతకంగా హింసించి చంపేశారని అన్నారు.సాయికృష్ణపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న మాట వాస్తవమేనని... అయితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కృష్ణలంక పోలీసులు కలిసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ప్లాన్ ప్రకారం చంపారని రాచమల్లు ఆరోపించారు. "ఈ హత్యకు ఎలాంటి సాక్ష్యాలు దొరకకూడదని పోలీస్ స్టేషన్లలో ఎక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్ లేకుండా పూర్తిగా మాయం చేశారు. ఇప్పుడు కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణ ఎన్ని గంటలకు చనిపోయాడు? అసలు ఎప్పుడు చనిపోయాడు? అనే కనీస వివరాలు రాయలేదు. ఆ రిపోర్టు చూస్తుంటే చంపిన పోలీసులే స్వయంగా కూర్చుని రాసుకున్నట్లు ఉంది" అని రాచమల్లు లైవ్ కౌంటర్ ఇచ్చారు.ప్రజా సంఘాలు, వైసీపీ కలిసి గట్టిగా ఒత్తిడి తేవడం వల్లే