
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్‌లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jun 25 2026 4:43 PM | Updated on Jun 25 2026 4:43 PM
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్‌లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం, భవిష్యత్ టోర్నీల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి భారత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో ఈ సిరీస్ లేదు. అయితే లంక బోర్డు అభ్యర్థన మేరకు బీసీసీఐ ఈ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇంకా అధికారిక షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఈ లోపే బిజీ షెడ్యూల్ దృష్ట్యా బీసీసీఐ ఈ సిరీస్‌ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. గతేడాది నవంబర్‌లో శ్రీలంకను తీవ్రంగా ప్రభావితం చేసిన ‘సైక్లోన్ డిట్వా’ బాధితుల సహాయార్థం ఈ సిరీస్‌ను నిర్వహించాలని అనుకున్నారు. ఈ సిరీస్‌కు కేవలం క్రికెట్ పరమైన ప్రాధాన్యమే కాకుండా మానవతా కోణం కూడా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం నెరవేరేలా లేదు.
టీ20 సిరీస్‌పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆగస్ట్‌లోనే ఇరు జట్ల మధ్య జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మాత్రం యథావిధిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న ఈ టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27)లో భాగంగా జరుగనున్నాయి.
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)
షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం
పోలీస్ బిగ్ బాస్ వెనుక చంద్రబాబు హస్తం..? సాయికృష్ణ ఫ్యామిలీతో బాబు డీల్