
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి ప్రత్యేక డేటా సెంటర్ నగరాన్ని నిర్మించే గొప్ప ప్రణాళికను చేపట్టింది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి డిజిటల్ కేంద్రంగా మార్చడానికి ఈ మెగా ప్రాజెక్టు దోహదపడనుంది.
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మొదటి ప్రత్యేక డేటా సెంటర్ నగరాన్ని నిర్మించే గొప్ప ప్రణాళికను చేపట్టింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి డిజిటల్ కేంద్రంగా మార్చడానికి ఈ మెగా ప్రాజెక్టు దోహదపడనుంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామం సమీపంలో సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ డేటా సెంటర్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటిగా మారనుంది.డేటా సెంటర్ సిటీ.. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయి హైపర్ స్కేల్ డేటా సెంటర్ సంస్థలను ఆకర్షించి, హైదరాబాద్ డిజిటల్ రంగంలో మరింత ముందుకు సాగేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ఈ ప్రాజెక్టుపై వివిధ సమీక్షలు నిర్వహించారు. నీటి, విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అన్ని మౌలిక అవసరాలపై పూర్తి వివరాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నారు.వివిధ గ్లోబల్ కంపెనీలతో ఒప్పందాలతో పెరగనున్న డేటా సెంటర్ల సామర్ధ్యం ఐటీ మరియు పరిశ్రమల శాఖ ఇప్పటికే అవసరమైన భూమిని గుర్తించి, పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 150 నుంచి 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం భూములు కేటాయించిన మరిన్ని 5గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి.రానున్న కాలంలో వివిధ గ్లోబల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారామొత్తం డేటాసెంటర్ల సామర్థ్యం 11గిగావాట్లకు మించి పెరగనుందని అధికారులు తెలిపారు.సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ ద్వారా మురుగునీటి శుద్ధీకరణప్రస్తుతం అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో పాటు CtrlS, క్యాపిటాలాండ్, NTT డేటా, సిఫీ, STT గ్లోబల్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్లను నడుపుతున్నాయి. డేటా సెంటర్ల నిర్వహణలో నీటి అవసరం చాలా కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ మోడల్‌ను అనుసరించి మురుగు నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయించింది.విద్యుత్ సరఫరాకు ఓపెన్ యాక్సెస్ వ్యవస్థహైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఆధ్వర్యంలో రోజుకు 1750 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న 41 స్టేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు పని చేస్తున్నాయి. వీటి నుంచి సుమారు 530 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నారు.విద్యుత్ సరఫరా విషయంలో కంపెనీలు ఓపెన్ యాక్సెస్ వ్యవస్థ ద్వారా సులభంగా విద్యుత్ పొందేలా అవకాశాలను పరిశీలిస్తున్నారు.అక్షరాలా రూ.10లక్షలు..విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఆఫర్!తెలంగాణ ఆర్థికవ్యవస్థకు కొత్త ఊపిరిశంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండటం, మంచి మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల చందన్‌వెల్లి మరియు ఫ్యాబ్ సిటీ ప్రాంతాలు ఇప్పటికే విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రాలుగా మారాయి. ఈ డేటా సెంటర్ సిటీ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఆర్థికవ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుంది. ఉపాధి అవకాశాలు పెరిగి, యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. డిజిటల్ భద్రత, డేటా నిల్వ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతల్లో భారతదేశం స్వయంసమృద్ధి సాధించడానికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుంది.