
Mirzapur The Movie Teaser : బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మిర్జాపూర్ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ బాగా ఫేమస్ అయింది.
తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ కి కనెక్ట్ అయ్యారు. ఈ సిరీస్ లో పాత్రలు, డైలాగ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ ఆధారంగా, దానికి కొనసాగింపుగా మిర్జాపూర్ – ది మూవీ అనే సినిమా రాబోతుంది.
అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో గుర్మీట్ సింగ్ దర్శకత్వంలో ఈ మిర్జాపూర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులో కూడా కానుంది.
తాజాగా ఈ మిర్జాపూర్ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా టీజర్ చూసేయండి..
ఈ టీజర్లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందులు తమ పాత్రలతో మరోసారి కనిపించగా జితేంద్ర కుమార్, రవి కిషన్ పాత్రలు కూడా ఈసారి మరింత మెప్పించనున్నాయి తెలుస్తుంది. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి.. పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.