
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి హైకోర్టు ( High Court)లో ఊరట లభించింది. హుజూర్నగర్ (Huzurnagar) ఉప ఎన్నికలో ఆయనపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
2019లో జరిగిన హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించారన్న ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో 5 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ఉన్నత న్యాయస్థానం 5 కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.