అలోవెరాలోని పోషకాలు పాదాలపై మురికి తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం రాత్రి పడుకునే ముందు తాజా అలోవెరాను పాదాలకు రాసుకోండి. ఉదయం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
టొమాటోలని ఎసిడిక్ నేచర్ పాదాలపై మురికి తొలగించి కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనికోసం తాజా టొమాటో గుజ్జును పాదాలకు రాసుకోండి. 15 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలు.
బంగాళాదుంప రసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి పాదాలపై మురికిని వదిలిస్తుంది. దీనికోసం బంగాళాదుంప రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పాదాలకు రాసుకోండి. అరగంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
పెరుగులో కొద్దిగా పసుపు కలిపి మందపాటి పేస్ట్ లాగా చేసుకోండి. దీనిని పాదాలకు బాగా అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే మురికి పోతుంది. పాదాలు కాంతివంతంగా మారుతాయి.
తేనె, నిమ్మరసం పాదాల మురికి తొలగించడంలో దోహదపడుతుంది. దీనికోసం నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి పాదాలకు రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
బొప్పాయిలోని ఎంజైమ్స్, తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పాదాలను కాంతివంతంగా మారుస్తాయి. దీనికోసం బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి పాదాలకు రాసుకోండి. అరగంట ఉంచి తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.
శనగ పిండి నేచురల్ స్క్రబ్‌లాగా పనిచేసి పాదాల మురికిని తొలగిస్తుంది. దీనికోసం శనగ పిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా పెరుగు కలిపి పాదాలకు రాసుకోండి. కాసేపు మర్దన చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు.
కీరదోసలోని కూలింగ్ గుణాలు పాదాల ట్యా్న్ తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం తాజా కీరదోస రసాన్ని పాదాలకు రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు.
పాదాలపై మురికి తొలగించడంలో ప్యుమిస్ స్టోన్ చాలా బాగా సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యుమిస్ స్టోన్‌తో పాదాలను మర్దన చేయడం ద్వారా మురికి తొలగిపోతుంది. పాదాలు అందంగా ఉంటాయి.