
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్ సర్వే నంబర్ 42లో ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణదారుల నుంచి రక్షించింది.
ఈ భూమి మెటల్ చార్మినార్ నుండి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ కు వెళ్లే ప్రధాన మార్గంలో, ఐటీ కారిడార్‌లో ఉండటంతో దీని విలువ దాదాపు రూ వేయి కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నది అధికారుల అంచనా.
కొందరు వ్యక్తులు అత్యంత విలువైన ఈ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. తమ సొంత ఆస్తిగా చూపిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఇతరులను అక్కడికి రానీయకుండా అడ్డుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. అంతే కాకుండా కబ్జాదారులు ఆ భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ పనులు చేపట్టారు.
దీంతో రెవెన్యూ అధికారులు హైడ్రాను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సంఘటనా స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు షెడ్లు, గదిని కూల్చివేయడంతో పాటు ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను పూర్తిగా తొలగించారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించిన అనంతరం, భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు హైడ్రా స్వయంగా ఆ 5 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఈ చర్యతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా కీలక చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తన ముద్దుల మావయ్య బాలయ్య కొత్త సినిమాకి క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్
.