
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Newlywed woman found dead in Visakhapatnam: సమాజంలో అసలు మానవ సంబంధాలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా భార్యభర్తలకు చెందిన సంబంధాలు మరింత దిగజారాయని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో జంటలు పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా ఒకర్ని మరోకరు చంపడమే టార్గెట్ గా పెట్లుకున్నట్లు ఉన్నారు. కొన్ని చోట్ల భార్యలు తమ భర్తల్ని చంపుకుంటే, మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని కాటికి పంపుతున్నారు. మరికొంత మంది పెళ్లి తర్వాత నెల రోజుల వ్యవధిలోనే విగత జీవులుగా కూడా మారిపోతున్నారు. ఈ క్రమంలో విశాఖ పట్నంలోని పీఎంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.
విశాఖ పట్నంలోని పీఎంపాలెం పోలీసుస్టేషన్ పరిధి ఆర్ హెచ్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 40 రోజులకే నవ వధువు యాండ్రాపు కృష్ణవేణి (25) అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని మృతి చెందటం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. స్థానికుల ప్రకారం.. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన దగ్గర బంధువైన యాండ్రాపు మురళీతో ఈ ఏడాది మే 13వ తేదీన కృష్ణ వేణికి వివాహమైంది. మురళీ ఓ కంపెనీ లో పనిచేస్తుండగా, కృష్ణవేణి గోపాల పట్నం ప్రాంతంలోని షాప్ లో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కొత్తగా పెళ్ల యిన వీరు గత 20 రోజులుగా పీఎంపాలెంలోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో మురళీ బుధవారం ఉదయం డ్యూటీ నుండి రాత్రి ఇంటికి తిరిగొచ్చేసరికి కృష్ణవేణి ఫ్యాన్ కి ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. దీంతో షాక్ కు గురైన మురళీ స్థానిక పోలీసులకు సమాచారమందించారు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వెంటనే ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ ఘట నాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read more: Tirumala Mock Drill: అర్ధరాత్రి తిరుమలలో భారీ ఆపరేషన్.. పీఏసీ 5 ఏరియాలోకి గన్స్‌తో దూసుకెళ్లిన బలగాలు, భక్తుల్లో ఉత్కంఠ!
మరోవైపు కృష్ణవేణి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లై కనీసం 40 రోజుల కూడా కాలేదని అంతలోనే ఈవిధంగా జరగటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మురళికి పెళ్లి ఇష్టంలేదా.?... ఇతర వివాహేతర సంబంధం ఏమైన ఉందా?.. కట్నం కోసం వేధింపులు ఏమైన జరిగాయా..?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.