సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్ల వాపును తగ్గిస్తాయని క్లీవ్‌లాండ్ క్లీనిక్ తెలిపింది.
బ్రకోలీ, క్యాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించి, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్ల వాపులు, నొప్పులను కంట్రోల్ చేస్తుంది.
అల్లంలో ఉండే ఔషధ గుణాలు కీళ్లలో మంట, వాపును తగ్గిస్తాయి. అల్లంను వివిధ రూపాల్లో ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్లు బలంగా మారుతాయి.
యోగర్ట్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. యోగర్ట్ తింటే కీళ్లు ఆరోగ్యంగా మారుతాయి.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలను, కీళ్లను బలంగా ఉంచుతాయి. గుమ్మడి గింజలు తింటే కీళ్ల నొప్పులు తగ్గే ఛాన్స్ ఉంది.
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ఇవి ఎముకలను, కీళ్లను బలంగా ఉంచుతాయి.
ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌ను వివిధ రూపాల్లో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్‌లో ఫాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.