
బళ్లారి: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ...
బళ్లారి: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.