
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6వ తేదీన మాయమైన రెండున్నరేళ్ల పసిగుడ్డు సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ.. నేటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఆ రోజు మధ్యాహ్నం జస్ట్ 15 నిమిషాల వ్యవధిలోనే ఆ చిన్నారి గాల్లో కలిసిపోయినట్లు మాయమైంది. అటవీ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టినా, వందలాది మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), అటవీ శాఖ సిబ్బంది రేయింబగళ్లు అడవులను దువ్వి పారేసినా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆఖరికి గాలింపు చర్యలు కూడా తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఈ మిస్సింగ్ కేస్ ఇప్పుడు పెను సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. తన కడుపు కోతను తట్టుకోలేక తల్లి భవాని తీవ్ర అస్వస్థతకు గురై కన్నీరుమున్నీరవుతోంది.వింతగా ప్రవర్తించి చనిపోయిన పెంపుడు కుక్క.. అసలు ట్విస్ట్ ఇదేనా?ఈ మిస్టరీ కథనంలో అత్యంత కీలకమైన, భయానకమైన మలుపు వారి పెంపుడు కుక్క. పాప అదృశ్యమైన రోజున ఆమె వెంటే వెళ్లిన ఆ కుక్క.. సరిగ్గా మూడు రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కానీ, వచ్చీ రాగానే అది వింతగా ప్రవర్తించింది, ఆహారం ముట్టలేదు, మనుషులపైకి దూకుడుగా దాడికి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తోటలోని ఇనుప కంచె వద్ద లభించిన పాప, కుక్క వెంట్రుకలు, కొన్ని వేలిముద్రలు ఎన్నో అనుమానాలకు తావిచ్చాయి. అయితే, ఆ కుక్క చనిపోయి రోజులు గడుస్తున్నా దాని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రాకపోవడం దర్యాప్తుకు పెద్ద బ్రేక్‌గా మారింది. అడవిలోని కొండచిలువ పాపను మింగేసిందా? లేక ఎవరైనా గూడుపుఠాణీ చేశారా? అనే ప్రశ్నలు తుని పరిసరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జ్ఞానేశ్వరి కోసం NDRF హైఅలర్ట్ ఆపరేషన్! క్షణక్షణం ఉత్కంఠ..హైకోర్టు సీరియస్.. కిడ్నాప్ కోణంలో పోలీసుల వేటచిన్నారి ఆచూకీ కనిపెట్టడంలో వైఫల్యంపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో తుని రూరల్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తును పూర్తిగా సాంకేతిక కోణంలో, కిడ్నాప్ యాంగిల్‌లోకి మార్చారు. ఆ ప్రాంతానికి వచ్చి వెళ్లిన సంచార జాతులు, జీడిపిక్కల వ్యాపారుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తూ చిక్కుముడులు విప్పే పనిలో పడ్డారు.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్: కుక్క వింతప్రవర్తన, కుక్కకు జీపీఎస్ ట్రాకర్ తో సెర్చ్ఆ కళ్లు కాయలు కాచే నిరీక్షణలోకి అజ్ఞాత జ్యోతిష్యుడు..ఈ ఘోర నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చిన ఒక జ్యోతిష్యుడి మాటలు ఇప్పుడు ఆ కుటుంబంలో కొత్త ఆశలు, అనుమానాలను రేకెత్తించాయి. చిన్నారికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని, కొందరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో భద్రంగా ఉంచారని ఆయన జోస్యం చెప్పారు. పాపను తూర్పు దిశగా తీసుకెళ్లారని, జూలై లేదా సెప్టెంబర్ లోపు ఆచూకీ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పి వెళ్లారు. మరి ఆ జ్యోతిష్యుడి మాట నిజమేనా? ఆ పసిపాప సురక్షితంగానే ఉందా? లేక ఆ అడవి తల్లి గర్భంలోనే ఏదైనా ఘోరం జరిగిపోయిందా? అనే సస్పెన్స్ తుని ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది.