
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను (Pawan Kalyan) నటుడు రామ్‌చరణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే.
ఆ ఫొటోలను రామ్ చరణ్ (Ram Charan) పంచుకున్నారు. బాబాయ్‌తో కలిసి విలువైన సమయాన్ని గడిపినట్లు తెలిపారు. అమరావతిలోని కొత్త జనసేన పార్టీ కార్యాలయం పురోగతిని చూడటం చాలా సంతోషంగా ఉందని చరణ్ అన్నారు. భవిష్యత్తులోనూ జనసేన మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
అమరావతిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి రామ్ చరణ్ వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయానికి కూడా వెళ్లిన ఆయన.. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని చూశారు. ప్రస్తుతం ఈ పొటోలను అభిమానులు ‘మెగా మూమెంట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.