
జోతిష్యశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహం గురు గ్రహం అని చెప్పొచ్చు.ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇది చంద్రుడికి సంబంధించిన రాశి. జులై 1న చంద్రుడు మకర రాశిలోకి అడుగుపెడతాడు.
ఆ సమయంలో చంద్రుడు, గురుడు వ్యతిరేక దిశలో ఉంటారు. ఆ సమయంలోనే అద్భుతమైన శుభ యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారిపై గురు గ్రహ అనుగ్రహం ఏర్పడుతుంది. దీంతో.. ఆ రాశులకు అద్భుతంగా కలిసొస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..
జులై నెలలో మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.ముఖ్యంగా ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.ఆదాయం పెరగడంతో.. జీవితంలో ఆనందం పెరుగుతుంది.గతంలో పెట్టుబడిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.విద్యార్థులు కూడా విజయం అందుకుంటారు.
జులై నెలలో గురు గ్రహ అనుగ్రహం కారణంగా మిథున రాశి వారి కష్టాలన్నీ తీరిపోతాయి. గురుదేవుని ఆశీస్సులతో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ ఖాలంలో వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగస్థులకు ఇది అనుకూల సమయం. ప్రమోషన్స్ వస్తాయి. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది.
గురు సంచారం మీన రాశివారికి కూడా అనేక ప్రయోజనాలు తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. చేసే పనిలో కోరుకున్న ప్రతిఫలం లభిస్తుంది. మంచి విజయాలు అందుకుంటారు.ఊహించని రీతిలో చేతికి డబ్బు అందుతుంది.
జులై నెలలో గురు గ్రహ సంచారం కారణంగా కుంభ రాశివారికి కూడా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా ఆనందం పెరుగుతుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పని ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కోరుకున్నవన్నీ లభిస్తాయి. ధనలాభం కూడా కలుగుతుంది.