
తిరుపతిలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేయాలన్నా పన్ను కట్టాల్సిందే. వ్యాపారం చేస్తున్నందుకు చిరు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు.
నగరంలో ఫుట్‌పాత్, బస్టాండ్, రైల్వేస్టేషన్, అలిపిరి, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద తోపుడు బండి ఏర్పాటుచేసుకోవాలన్నా టిఫిన్లు, పండ్లు, పూలు అమ్ముకోవాలన్నా కొందరు కార్పొరేటర్లు, నాయకులకు నెలనెలా పైకం ముట్టజెప్పాల్సిందే. ప్రాంతాన్ని బట్టి ధర నిర్ణయించి వసూలుచేస్తూ అధికారులు వ్యాపారానికి అడ్డుతగిలితే వారిని నిలువరిస్తారు. అమ్మకానికి కాలిబాటలు |