
ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది.
తక్కువ బడ్జెట్లో దేశంలోని మోస్ట్ పాపులర్ పుణ్యక్షేత్రాలను చుట్టేయడానికి "భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు" ద్వారా ఒక సూపర్ ప్యాకేజీని లాంచ్ చేసింది. "5 జ్యోతిర్లింగ యాత్ర విత్ ద్వారకాధీశ్ టెంపుల్ అండ్ ఎల్లోరా" పేరుతో సాగే ఈ స్పెషల్ టూర్ ఏకంగా 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగనుంది. 2026 జూలై 11న ప్రారంభమయ్యే ఈ జర్నీ జూలై 21న ముగుస్తుంది.
ఈ స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మధ్యప్రదేశ్‌లోని రేవా స్టేషన్ నుండి జూలై 11వ తేదీ లేట్ ఈవెనింగ్ బయలుదేరుతుంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ పలు బోర్డింగ్, డీ-బోర్డింగ్ పాయింట్లను కేటాయించింది. భక్తులు రేవాతో పాటు సత్నా, మైహర్, కట్ని, జబల్పూర్, నార్సింగ్‌పూర్, ఇటార్సీ, రాణి కమలపతి, షుజల్పూర్, ఉజ్జయిని, రత్లాం స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఖాండ్వా, ఇటార్సీ, నార్సింగ్‌పూర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, రేవా స్టేషన్లలో దిగిపోవచ్చు.
ఈ టూర్ ప్లాన్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. కేవలం ఒకే ఒక్క టికెట్‌తో భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, చరిత్ర, ఆధ్యాత్మికతను ఎక్స్ప్లోర్ చేయవచ్చు.
• ద్వారక: ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, నాగేశ్వర మహాదేవ్ జ్యోతిర్లింగం.
• సోమనాథ్: ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం.
• ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్): ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఎల్లోరా గుహలు.
• జూలై 11, 12: రేవాలో ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. వివిధ స్టేషన్లలో భక్తులు బోర్డింగ్ అవుతారు. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.
• జూలై 13, 14: ద్వారక చేరుకుంటారు. అక్కడ ద్వారకాధీశ్, బేట్ ద్వారక, నాగేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. జూలై 14 రాత్రి సోమనాథ్ బయలుదేరుతారు.
• జూలై 15: సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం అనంతరం పూణేకి జర్నీ.
• జూలై 16, 17: పూణే చేరుకుని హోటల్లో బస చేస్తారు. మరుసటి రోజు భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని నాసిక్ రోడ్‌కు బయలుదేరుతారు.
• జూలై 18: నాసిక్‌లో త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని ఛత్రపతి సంభాజీనగర్ వెళ్తారు.
• జూలై 19: ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా గుహల సందర్శన ఉంటుంది.
• జూలై 20, 21: రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నిర్దేశిత స్టేషన్లలో ప్రయాణికులు డీ-బోర్డ్ అయ్యాక జూలై 21 ఉదయానికి రేవా చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం రైల్ టూరిజం ప్రోత్సహించేందుకు ఈ భారత్ గౌరవ్ స్కీమ్ కింద దాదాపు 33 శాతం వరకు కన్సెషన్ ఇస్తోంది. ఈ రాయితీతో కలుపుకుని జీఎస్టీతో సహా ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి..
1. ఎకానమీ క్లాస్ (Sleeper): రూ. 20,250. ఇందులో నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ జర్నీ, బడ్జెట్ హోటల్లో నాన్-ఏసీ రూమ్స్ (మల్టీ షేరింగ్), లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం నాన్-ఏసీ బస్సు జర్నీ సేవలు అందిస్తారు.
2. స్టాండర్డ్ క్లాస్ (3AC): రూ. 33,250. ఇందులో 3AC క్లాస్ జర్నీ, ఏసీ హోటల్ రూమ్స్ (ట్విన్/ట్రిపుల్ షేరింగ్), లోకల్ విజిట్స్ కోసం నాన్-ఏసీ బస్సులు ఉంటాయి.
3. కంఫర్ట్ క్లాస్ (2AC): రూ. 44,000. ఇందులో 2AC క్లాస్ జర్నీ, ఏసీ హోటల్ రూమ్స్ (ట్విన్/ట్రిపుల్ షేరింగ్), లోకల్ సైట్‌సీయింగ్ కోసం ఏసీ బస్సులు కేటాయిస్తారు.
ప్యాకేజీలోనే వచ్చేవి: ఉదయం టీ/కాఫీ, వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. రోజుకు ఒక లీటర్ రైల్‌నీర్ వాటర్ బాటిల్ ఇస్తారు. ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, కోచ్‌లకు భద్రతా సిబ్బంది, టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఉద్యోగులకు టూర్ పూర్తయ్యాక ఎల్టీసీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
మీ సొంత ఖర్చులు: గుడుల్లో ప్రత్యేక దర్శనం టికెట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అవసరమైతే భక్తులే చేసుకోవాలి. ల్యాండ్రీ, మందులు, స్మారక కట్టడాల ఎంట్రీ ఫీజులు, బోటింగ్, పర్సనల్ ఖర్చులు ప్యాకేజీ కిందకు రావు.
బుకింగ్స్ కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( ను సందర్శించవచ్చు లేదా జబల్పూర్, ఇండోర్, భోపాల్, నాగ్‌పూర్ రీజినల్ ఆఫీసులను సంప్రదించవచ్చు.