
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో ఆయన సోదరి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కీలకంగా మారాయి. లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి కేతన్ చనిపోవడంపై..
కాబోయే భార్య ప్రవర్తన, మాటల తీరుపై సోదరి రేకెత్తించిన అనుమానాలే ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ గుట్టును రట్టు చేశాయి.ప్రమాదం జరిగిన తీరుపై సియా పదే పదే మాటలు మారుస్తూ, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన కేతన్ సోదరి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పూణె రూరల్ పోలీసులు నిందితురాలైన సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి (22) లను పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు.జూన్ 18న ట్రెక్కర్స్ స్పాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ కేతన్ కాలుజారి పడిపోయాడంటూ సియా మొదట ఆడిన నాటకం, కేతన్ సోదరి నిలదీతతో అడ్డం తిరిగింది. అంత్యక్రియల సమయంలో సియా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం, ఘటనపై అడిగిన ప్రతిసారీ ఒక్కో కథనం చెప్పడంతో సోదరి అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా, ప్రియుడు చేతన్ కోసం కాబోయే భర్తను వదిలించుకోవడానికి సియా వేసిన క్రూరమైన స్కెచ్ వెలుగు చూసింది.బాడీ లాంగ్వేజ్‌తో సిగ్నల్.. ఆపై ఘాతుకం!రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డైరెక్టర్‌గా ఉన్న కేతన్‌తో పెళ్లి ఇష్టం లేని సియా జూన్ 18న ఆయనను కోటలోని ఒక నిర్మానుష్యమైన కొండ అంచుకు తీసుకెళ్లింది. వీరిని అనుసరిస్తూ ప్రియుడు చేతన్ కూడా