
దిల్లీ: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ వచ్చిన ఘటనకు సంబంధించి క్యాటరింగ్ సంస్థకు ఐఆర్సీటీసీ రూ.లక్ష జరిమానా విధించింది.
ఆహారశాల లైసెన్స్‌ను రద్దు చేస్తామంటూ షోకాజ్ నోటీసు అందించింది. అహ్మదాబాద్-ముంబయి తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ప్రయాణించిన ఓ వ్యక్తి వెజ్ బిర్యానీని ఆర్డర్ చేశారు. దానిని తినే సమయంలో ఆయనకు అందులో ఈగ కనిపించింది. దీంతో ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రైలు కెప్టెన్, క్యాటరింగ్ విభాగం మేనేజర్ ప్రయాణికుడి వద్దకు చేరుకున్నారు. సంబంధిత సిబ్బంది ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పారు. మరో భోజనం అందిస్తామన్నారు. ఆయన దానిని తిరస్కరించారు. ఈ క్రమంలో సూరత్‌లోని తమ ప్రధాన భోజనశాల నుంచి ప్రయాణికులకు భోజనాలు సేకరించిన అర్హా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాటరింగ్ సంస్థకు ఐఆర్సీటీసీ జరిమానా విధించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.