
Today Horoscope June 25 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 జూన్ 25వ తేదీ, గురువారం, ప్రత్యేక ఏకాదశి రోజు.
పండితుల విశ్లేషణ ప్రకారం అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవి? ఏ రాశి వారు అత్యంత జాగ్రత్త వహించాలి? కొత్త పనులు ప్రారంభించకూడదా? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి: ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు పుంజుకుంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటా. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం శ్రేయస్కరం.
వృషభ రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, ముఖ్యంగా కీలక విషయాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల సూచనలు పాటించడం తప్పనిసరి. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసివచ్చే సమయం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
కర్కాటక రాశి: ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం ముఖ్యం. కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, కావున కోపాన్ని తగ్గించుకోవడం మంచిది; లేనియెడల కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. పని ప్రదేశంలో జాగ్రత్త వహించండి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఇంటి వ్యవహారాలపై దృష్టి పెట్టండి.
కుంభ రాశి: ఈరోజు మీకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు చేసేటప్పుడు ఇష్టానుసారంగా కాకుండా నియంత్రణ పాటించండి. ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరుల గొడవల్లో తలదూర్చకపోవడం మంచిది. పెద్దల సూచనలు పాటించండి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం. కొత్త పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు.
మీన రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటమే ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి, కోపాన్ని నియంత్రించుకోండి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)