కన్నా కాలేజ్‌కి వెళ్తుంటే డ్రాప్ చేస్తానని చక్రి అంటాడు. దీంతో కన్నా, కేశవ చక్రిని తిడతారు. ఎన్ని రోజులు ఇలానే ఉంటారు.. మీరంతా ఏనాడూ ఏ తప్పు చేయలేదు.. నేను ఒక్కడ్నే చేశా.. నేను మాత్రమే చెడపుట్టాను..
ఎవరైనా పోయారా?.. ఎందుకు మౌనం పాటిస్తున్నారు.. కిరాతకుడిలా ఎందుకు చూస్తున్నారు.. నా భార్య గడిలోకి వెళ్లాను.. నేను ఆమెను తాకలేదు.. చెడు దృష్టితో చూడలేదు.. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం.. ఇలానే నిశ్శబ్దంగానే ఉంటారా.. అని చక్రి అంటాడు. ఇప్పుడేం చేయమంటావా? చప్పట్లు కొట్టమంటావా? అని ఫైర్ అవుతాడు కన్నా. మహాని మనం వెళ్లగొట్టలేదు.. తనే వెళ్లిపోయింది అని చక్రి అంటాడు. మనం కాదు.. నువ్వు.. తాగొచ్చి గదిలోకి వెళ్లి బెదరగొట్టావ్ అని కేశవ అంటాడు. భార్య అని నువ్వు అనుకోవడం కాదు.. భర్త అని తను కూడా అనుకోవాలి.. అని కేశవ అంటాడు. అసలేం జరిగిందంటే అని చక్రి చెప్పేలోపు.. ఇక ఆపు అని పెద్ది అంటాడు. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు.. ఇక మాట్లాడకు.. మీకు మంచీచెడూ అన్ని నేర్పించాను.. అవన్నీ ఏం అయ్యాయి.. అని పెద్ది తిడతాడు.పెద్ది ఆవేశం.. ఇప్పుడు నిన్ను మేం ఏదో వెలి వేసినట్టు.. ఈ ఇంట్లోంచి పొమ్మన్నట్టుగా మాట్లాడుతున్నావ్.. మహాలక్ష్మీకి అన్ని హద్దులు తెలుసు.. మనల్ని నమ్మింది.. అందుకే గడియ కూడా పెట్టుకోలేదు.. కానీ ఈ బృందావనంలో కలుపు మొక్క పెరుగుతుందని, ఇలా చేస్తుందని తనకేం తెలుసు.. సింహం బోనులో చిక్కుకున్న లేడి పిల్లలా బెదిరిపోయింది.. తాకలేదు అంటున్నావ్.. రూంలోకి వెళ్లి.. గడియ పెట్టి.. కదలకుండా చేశావ్.. నీ ఆ దుర్బుద్దితో కూడుకున్న చూపులు చాలు.. మహా అపవిత్రం కావడానికి.. ఆడవాళ్ల సహనాన్ని పరిశీలిస్తే.. భూకంపం పుడుతుంది అని పెద్ది తిట్టేసి వెళ్లిపోతాడు.కొత్త ప్లాన్ వేసిన శైలు.. మీరంతా మంచివాళ్లే.. నేనే చెడ్డ వాడ్ని.. మహా లేదు.. మీరు నాతో మాట్లాడరు.. జాబ్ లేదు.. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. నేను నాశనం అయిపోతా.. సర్వ నాశనం అయిపోతా.. అని చక్రి అనుకుంటూ బాధపడతాడు. మరో వైపు కేశవ కోసం చోటు గాడ్ని శైలు ఆట పట్టిస్తుంది. మీ అన్న అసలు నన్ను పట్టించుకోవడం లేదు అని శైలు అంటే.. నువ్వు కూడా పట్టించుకోకు అని చోటు గాడు అంటాడు. నేను ప్రేమిస్తున్నా కదా అని శైలు అంటుంది. మా అన్న కూడా నిన్ను ప్రేమించాలి కదా? అని చోటు గాడు అంటాడు. ముంగిస గాడికి కూడా నేనంటే ఇష్టం ఉంది.. కానీ బయట పడటం లేదు.. అని శైలు అంటుంది.నీ కూతురిని ఇచ్చి చేస్తావా? బండరాతి గుండెలోంచి వాడి ప్రేమను బయటకు తీస్తాను.. తనతోనే చెప్పిస్తాను.. నువ్వే నాకు హెల్ప్ చేయాలి.. అని చోటుగాడితో అంటుంది శైలు.ఇక చోటుగాడికి శైలు ఓ ప్లాన్ చెబుతుంది. అలానే చేయమని అంటుంది. మహా అన్న మాటలు, పెద్ది అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ రోడ్డుపై నడ్చుకుంటూ వెళ్తుంటాడు చక్రి. ఇంతలో బస్తీ ఆంటీలు ఎదురై మరింతగా రెచ్చగొడతారు. నీ పెళ్లాంని టార్చర్ పెట్టి ఉంటావ్.. అందుకే పోయి ఉంటుందని అంటారు. అవును పోయింది.. నీ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తావా? అని చక్రి కౌంటర్లు వేస్తాడు. మా ఇంట్లో గొడవల గురించి మీకు ఎందుకు అండి.. అని కేశవ వచ్చి ఆంటీలను పంపించేస్తాడు.ఆమె కోసం ఎన్నో చేశాను.. ఆడవాళ్లతో గొడవ ఏంట్రా అని చక్రిని కేశవ అంటాడు. నేను గొడవ పెట్టుకోలేదు.. వాళ్లే నాతో గొడవ పడ్డారు.. పక్క వాళ్ల మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో ఈ జనాలు అని చక్రి ఫైర్ అవుతుంటాడు. కోపం అంతా తను వెళ్లిపోయింది అనా.. వాళ్లు మాట్లాడినందుకా? అని కేశవ అంటాడు. తను వెళ్లినందుకు బాధగా.. వాళ్లు అన్నందుకు కోపంగా ఉంది.. నన్ను మాత్రమే దూరం పెట్టేది రా.. నేనేం తప్పు చేశాను.. ఆమె కోసం ఎన్నో చేశాను.. చివరకు సర్టిఫికెట్లు తీసుకొచ్చా.. అప్పు చేసి స్కూటీ కొనిచ్చా.. ఇన్ని మంచి పనులు చేసిన నేను.. ఒక్క తప్పు చేస్తే వెళ్లిపోతుందా.. కావాలని చేయలేదు.. ఎక్కడ దూరం అవుతుందో అని చెప్పుడు మాటలు విని అలా చేశా..ఇష్టం ఉన్నట్టే కదా.. నేను చేసింది సమర్థించుకోవడం లేదు.. కావాలంటే నన్ను కొట్టొచ్చు కదా.. నా గుండెల మీద కొట్టేసి వెళ్లాలా? అని చక్రి బాధపడతాడు. బాధపడకు రా అని కేశవ అంటాడు. బాధ పడకుండా ఎలా ఉండాల్రా.. నేను చెడ్డవాడ్నేరా.. కానీ మహాలక్ష్మీ విషయంలో మాత్రం మంచివాడ్నే.. తను నా ఎదురుగా ఉండాల్రా.. తను ఉంటే కొండంత బలంగా, ఆనందంగా ఉంటుంది అని చక్రి అంటాడు. నువ్వు కట్టిన తాళి అబద్దమే అయినా, తెంచకుండా వెళ్లిపోయిందంటే.. ఇష్టం ఉన్నట్టే కదా.. ఆమె తిరిగి వస్తుంది లే అని కేశవ కాస్త భరోసానిస్తాడు. ఆమెను మళ్లీ ఫ్రెష్‌గా ప్రేమించు.. అని కేశవ సలహాలు ఇస్తాడు. ప్రేమంటే తెలియని వాడు ప్రేమ సలహాలు ఇస్తున్నాడేంటి అని చక్రి కామెడీ చేస్తాడు.మీతో నేను ఎందుకు మాట్లాడాలి.. తను నన్ను ప్రేమించకపోయినా పర్లేదు కానీ క్షమించకపోతే తట్టుకోలేను రా అని చక్రి బాధపడుతూ మహాలక్ష్మీ ఆఫీస్‌కి వెళ్తాడు. ఏం చెప్పాలి.. ఏం మాట్లాడాలి.. తిట్టి పంపిస్తుందా? అని ఇలా మెట్ల మీదే నిల్చుని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు చక్రి. ఇంతలో దివ్య అక్కడకు వస్తే మహాని కాస్త పిలుస్తారా? అని చెబుతాడు. భూకంపం వచ్చింది మహా.. అని దివ్య అంటే.. పారిపోదాం పదా అని మహా అంటుంది. భూకంపం అంటే.. ఆఫీసులో గొడవ చేసిన అతను వచ్చాడు అని చెబుతుంది దివ్య. ఏంటి.. అని మహా అడుగుతుంది. మీతో నేను ఎందుకు మాట్లాడాలి.. ఫోన్ లిఫ్ట్ చేయను.. డైరెక్ట్‌గా ఆఫీసుకే వస్తావా? అని తిడుతుంది మహా.నా మీద నాకే అసహ్యంగా మీరు అలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉందండి అని చక్రి అంటాడు. మీరు చేసిన దానికి మాకు అంతకంటే బాధగా ఉంది.. అయినా ఆఫీసుకు ఎందుకు వచ్చావ్.. మళ్లీ గొడవ చేయడానికా? అని మహా అంటుంది. నేను అందుకు రాలేదండి.. మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి వచ్చా అని అంటుంది. అది జరగని పని.. అని మహా అంటుంది. నాకు అసలు నిద్ర పడటం లేదు.. నా మీద నాకే అసహ్యంగా ఉందండి.. అలా కావాలని చేయలేదు.. జరిగిందంతే.. అని చక్రి అంటాడు. ఏంటి అంత సింపుల్‌గా అంటారు.. తాగేసి రూంలోకి వచ్చాడు.. నన్ను ఓ వస్తువులా చూసి హక్కులా మాట్లాడారు..అది ఎప్పటికీ జరగదు.. మా వాళ్ల కంటే మిమ్మల్నే ఎక్కువగా నమ్మాను.. మా వాళ్లు నిన్ను కిడ్నాప్ చేశారని తెలియక మీ కోసం ఎంత కంగారు పడ్డాను.. నాకు పెళ్లి విషయంలో సాయం చేశారు.. మీరు ఉన్నత విలువలు కలిగిన వారు అనుకున్నా.. ఇప్పుడు ఉన్న విలువంతా పోగొట్టుకున్నారు.. అని తిడుతుంది మహా. మీరు ఎన్నైనా తిట్టండి పడతాను.. కానీ క్షమించండి అని చక్రి అంటాడు. అది ఎప్పటికీ జరగదు.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో.. ఇంకోసారి రాకు అని చెప్పి వెళ్తుంది మహా. ఏం జరిగింది అని విక్కీ అడుగుతాడు. ఏం జరగలేదు అని మహా చెబుతుంది. దీంతో విక్కీ సైలెంట్‌గా వెళ్లిపోతాడు.పెళ్లి చూపులు అయ్యాయి.. శైలు ఇక రీల్స్ చేయదు అంట అని చోటు గాడు అంటాడు. ఏ.. ఫాలోవర్స్ తగ్గిపోయారా? ఆమె రీల్స్ చూసి చిరాకు పుట్టి ఫాలోవర్స్ తగ్గారా? ఇంకా రీల్స్ చేస్తే కొడతామని అన్నారా? అని కేశవ కామెడీ చేస్తాడు. లేదు ఆమెకు పెళ్లి చూపులు అయ్యాయి అంట అని చోటు గాడు చెప్పడంతో కేశవ కాస్త ఫీల్ అవుతాడు. ఇకపై ఆమె మన షాప్ వైపు రానే రాదు.. నీకు ఆమె గోల ఉండదు అని చోటు గాడు అంటాడు. దీంతో కేశవ ఆలోచనల్లో పడతాడు. రాత్రి పూట పెద్ది దోశలు వేస్తుంటే.. కన్నా గాడు తింటూ ఉంటాడు. మహా కిచెన్‌లో ఉండి.. చెప్పే మాటల్ని, పనుల్ని పెద్ది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కేశవ అయితే ఇంట్లోకి వచ్చినా శైలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.తినకుండా వెళ్లిన నారాయణ.. శైలు మ్యాటర్‌తో చిరాకులో ఉన్న కేశవ ఇష్టమొచ్చినట్టు మాట్లాడేస్తుంటాడు. చక్రి ఎక్కడున్నాడు అని పెద్ది అంటే.. వాడు ఎక్కడ చచ్చాడో నాకేం తెలుసు అంటాడు. నారాయణకు దోశలు వేసి ఇస్తాడు పెద్ది. ఇతడ్ని ఎందుకు మేపుతున్నావ్.. దీనంతటికి కారణమే ఇతడు.. చక్రిని తాగుబోతుని చేసింది ఇతడే అని అంటాడు. నేను ఆమె మనసులో స్థానం సంపాదించుకోమని సలహా ఇస్తే వాడు గదిలోకి వెళ్లాడు అని నారాయణ అంటాడు. నువ్వు ఎలా చెప్పి ఉంటావో మాకు తెలీదా.. అసలు ఇతడ్ని నాలుగు రోజులు అన్నం పెట్టకుండా మాడగొడితే ఇంట్లోంచి వెళ్లిపోతాడు.. దరిద్రం పోతుంది అని కేశవ అంటాడు. దీంతో తినకుండానే నారాయణ వెళ్లిపోతాడు. ఏ రా.. కన్నతండ్రిని అలా అంటావ్.. అని కేశవని పెద్ది తిడతాడు. మన ఇంట్లో రోజూ గొడవలే.. తినే కన్నా గాడు కూడా మధ్యలోని కడిగేస్తాడు. ఎందుకు రా.. అలా కడిగేశావ్ అని పెద్ది అంటే.. నా ఆకలి చచ్చిపోయింది.. ఇక మన ఇంట్లో రోజూ గొడవలే.. వదిన వెళ్లిపోయింది.. మన ప్రశాంతత, మనశ్శాంతి కూడా పోయింది.. బయటకు వెళ్తే.. వీధిలో వాళ్లు.. మీ వదిన వెళ్లిపోయిందంట కదా అని అడుగుతున్నారు.. ఇంటికి వస్తే అందరూ తన్నుకుని చస్తున్నారు.. మళ్లీ మనం పాత బతుకే బతకడం అలవాడు చేసుకోవాలి అని కన్నా ఏడ్చేసుకుంటూ వెళ్లిపోతాడు. కేశవ ఏమో శైలు ఆలోచనల్లో సతమతం అవుతుంటాడు.