
నా భర్తకు 35 సంవత్సరాలు, అతను ఈ మధ్య పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటు పడ్డాడు. తన మొౖబైల్లో పోర్న్ స్క్రోల్ చేయటంలో గంటల తరబడి గడుపుతూ నన్ను, మా పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడు.
Jun 25 2026 6:29 AM | Updated on Jun 25 2026 6:29 AM
నా భర్తకు 35 సంవత్సరాలు, అతను ఈ మధ్య పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటు పడ్డాడు. తన మొౖబైల్లో పోర్న్ స్క్రోల్ చేయటంలో గంటల తరబడి గడుపుతూ నన్ను, మా పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆన్లైన్ వీడియో చాటింగ్‌కు డబ్బు చెల్లిస్తున్నాడని కూడా తెలిసింది. ఆఫీస్‌లోనూ అతని పనితీరుపై తన బాస్‌తో తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అతను నాతో శారీరక సాన్నిహిత్యంపై ఆసక్తి చూపటం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో... మా వివాహ బంధాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియటం లేదు. నేను ఏమి చేయాలో చెప్పండి. – కృష్ణ్ణవేణి, బెంగళూరు మీ ఆందోళన అర్థమవుతోంది. ఈ సున్నితమైన పరిస్థితి గురించి మాట్లాడే ధైర్యం చేసినందుకు ముందుగా మీకు అభినందనలు. పోర్నోగ్రఫీ వ్యసనం అనేది కుటుంబ జీవితం, వృత్తిపరమైన పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను కలిగి ఉండే సంక్లిష్టమైన సమస్య. అతని ప్రవర్తన, మీ కుటుంబంపై దాని ప్రభావం గురించి అతన్ని నిందించేటట్లు కాకుండా నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ ఆందోళనలు, భావాలను ప్రశాంతంగా వ్యక్తపరుస్తూ, అతని చర్యలు మీపై, మీ పిల్లలపై ఎంత ప్రభావం చూపుతున్నాయో డిస్కస్ చేయండి. ఒక మంచి సైకియాట్రిస్టు సలహాలతో (కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ) ఇతర చికిత్స విధానాలతో, అతన్ని ఈ వ్యసనానికి దూరం చేయవచ్చు. ఇద్దరూ కలిసి కపుల్ థెరపీకి హాజరు కావడానికి కూడా ప్రయత్నించండి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి మీ మధ్య సాన్నిహిత్యం పెంచడానికి కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం గురించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోండి. మీకు వ్యక్తిగత కౌన్సెలింగ్, ఈ సమస్యల నుంచి ధైర్యంగా సమర్థంగా బయటకుపడేందుకు సహాయపడుతుంది. అయితే ఏదైనా వ్యసనం నుంచి కోలుకోవటం అనేది చాలా సమయం, ఓర్పు, క్రమశిక్షణతో కూడుకున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. ఈ క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడటానికి నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల నుంచి మద్దతు పొందడానికి వెనుకాడకండి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)
సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం
లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?
జేసీ అనుచరుల కంటే పోలీసులే నీచంగా ప్రవర్తిస్తున్నారు
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!