
ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని...
Jun 25 2026 7:14 AM | Updated on Jun 25 2026 7:14 AM
ముంబై: బాల్యవివాహాల నియంత్రణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను పరిశీలిస్తోంది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త నిబంధన తీసుకురావాలని యోచిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యుడు అతుల్ భత్ఖాల్కర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను సభకు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే విధానం ఇప్పటికే రాజస్థాన్‌లో అమల్లో ఉందని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, ఈ విధానాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)
సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
రోజా పువ్వుతో మ్యాడ్ బ్యూటీ పోజులు.. ఫోటోలు
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
ముద్రగడ ఆరోగ్యంపై పిచ్చి వార్తలు.. తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ వార్నింగ్
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు
దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం
లోకేష్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. ఎందుకంటే ?