
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్లో విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారు.. లేదంటే మైనస్ మార్కులు పడతాయి. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది’’ అంటూ సరదాగా మాట్లాడారు.
విద్యార్థులతో తాను మాట్లాడిన వీడియోను మంత్రి లోకేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘మీరంతా బాగా చదవాలి. మీకు మార్కులు సరిగా రాకపోతే సీఎం గారు నా మార్కులు తీసేస్తారు. బాగా చదవాలి. టీచర్లు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఏ సందేహం ఉన్నా వారిని అడగండి. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను గౌరవించాలి. ఆ విషయాన్ని మరిచిపోవద్దు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే.. ఉపాధ్యాయులు నన్ను గైడ్ చేయడం, బాగా చదువు చెప్పడం వల్లే. సమ్మెటివ్ అసెస్మెంట్, ఫార్మెటివ్ అసెస్మెంట్లో మంచి మార్కులు రావాలి. మీరు శ్రద్ధ పెట్టాలి.. సరేనా?’’ అని విద్యార్థులతో అనగా.. వారంతా ఓకే సర్ అని ఎంతో ఉత్సాహంగా బదులిచ్చారు.
ఈ పర్యటనలో భాగంగా మోపిదేవిలో అవనిగడ్డ నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, నేతలతో లోకేశ్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది-సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై అలసత్వం వద్దు. ప్రతి ఓటూ విలువైనదే’’ అని దిశానిర్దేశం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే చీకటి గది మాత్రమే కాదు.. చేసిన తప్పును తెలియజేసి సన్మార్గులుగా మార్చే సంస్కరణాలయం అని నిరూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ.