భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ కిశోరం వైభవ్ సూర్యవంశీపై 1983 ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈ యువ ప్రతిభావంతుడి విషయంలో అప్పుడే తొందరపడి అంచనాలకు రావడం సరికాదని, అతడి అసలు సామర్థ్యం 20 ఏళ్లు దాటిన తర్వాతే స్పష్టమవుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి వైభవ్‌ను సచిన్ టెండుల్కర్తో పోల్చడం సముచితం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ యువ ఆటగాడిపై అధిక ఒత్తిడిని పెంచకుండా, సహనంతో వేచి చూడాలని కపిల్ దేవ్ సూచించాడు.బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ, ఐర్లాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో గనుక అతడు బరిలోకి దిగితే, భారత జట్టు తరఫున అత్యంత పిన్న వయసులో ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటికే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున, దేశవాళీ క్రికెట్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.బుధవారం నాడు కపిల్ దేవ్ మాట్లాడుతూ, "వైభవ్ చాలా చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడు. సచిన్ లాగానే చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి వైభవ్ అడుగుపెడుతున్నాడు. అయితే, సచిన్ తరహాలో అతను సుదీర్ఘకాలం పాటు రాణించగలడా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. వైభవ్‌కు 20-22 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే అతడి సామర్థ్యంపై ఒక అంచనాకు రావాలి" అని పేర్కొన్నాడు. మరోవైపు, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ ప్రతిభను ప్రశంసించారు. ఇటీవల ముక్కోణపు సిరీస్ ఫైనల్లో