
Voter Registration : మీకు ఇంకా ఓటు హక్కు రాలేదా? మీ వయస్సు 18 ఏళ్లు నిండి తర్వాత కొత్తగా ఓటు పొందాలంటే? ఏం చేయాలి? ప్రస్తుత ఓటర్ సమగ్ర సవరణ జాబితాలో కొత్త ఓటర్ పేరు లిస్టులో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా? ఓటరు వివరాలు లేదా ఫారమ్ నింపడంలో ఏదైనా సమస్యలు ఎదురైతే ఎవరికి అడగాలి? ఎక్కడ సాయం పొందాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also : Enumeration Form : ఎన్యూమరేషన్ ఫారమ్ అందలేదా? అదేలా నింపాలి? ఓటర్ల లిస్టులో పేరు ఎలా చెక్ చేయాలి? పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్
ఈ ఏడాదిలో లేదా తర్వాత 18 ఏళ్లు నిండితే పేరుకోసం ఎలా అప్లయ్ చేయాలంటే.. ముందుగా ఓటరు లిస్టులో పేరు చేర్చేందుకు 01/10/2026 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే ఓటరు కూడా ఇంటింటి గణన కోసం ఎన్యూమరేషన్ బూత్ స్థాయి అధికారి నుంచి ఫారం 6, డిక్లరేషన్ ఫారం నింపి ఆపై సమర్పించవచ్చు. ఆయా దరఖాస్తులను సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలిస్తారు. మీరు అర్హులుగా తేలితే మీ పేర్లు ఫైనల్ ఓటర్ లిస్టులో చేరుతాయి.
ఫారమ్, ఓటరు వివరాల సమస్యలపై ఎక్కడ సాయం పొందాలి? : ప్రతి ఇంటిని సందర్శించే బూత్ స్థాయి అధికారులు (BLOs) ఫారమును నింపడంతో పాటు ఓటరు వివరాలు వెల్లడించడంలో కూడా సాయం చేస్తారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారు.
ఒకవేళ టోల్ ఫ్రీ ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ (1950)ను కూడా సంప్రదించవచ్చు లేదా వెబ్సైట్ / ECINET యాప్‌లో ‘Book a Call with BLO’ సదుపాయాన్ని వినియోగించవచ్చు.