
ఆంధ్రప్రదేశ్‌లో నూతన స్వర్ణయుగం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం రావడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (GMSI) సుమారు రూ. 405 కోట్ల పెట్టుబడితో ఈ గనిని అభివృద్ధి చేసింది. 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో సమీకృత ప్రాసెసింగ్ యూనిట్‌తో ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గని ఇదే కావడం గమనార్హం. జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయ్ గ్రామాల పరిధిలో 597.82 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఓపెన్-పిట్ గని విస్తరించి ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) ఈ గని నుంచి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రానున్న కాలంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా ఒక టన్ను (1000 కిలోలు)కు పెంచనున్నారు. ఇక్కడ మొత్తం 12 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 300, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి లభించనుంది.ఈ గని కార్యకలాపాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో భారీ ఆదాయం అందనుంది. తొలి ఏడాది సుమారు రూ. 57 కోట్లు, పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఏటా రూ. 144 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆదాయంతో పాటు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా స్థానిక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న