
సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సమంతకి ఈ చిత్రం సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. నంది
ని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా భాగం అయ్యారు. రాజ్ ఈ చిత్రానికి కథ అందించారు.
సమంత మరోసారి ఈ చిత్రంతో తన స్టార్ పవర్ నిరూపించుకుంది. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే మా ఇంటి బంగారం కలెక్షన్స్ జోరుకి అడ్డు కట్ట వేయడానికి 3 క్రేజీ హీరోలు బ్లాక్ బస్టర్స్ సినిమాల రీ రిలీజ్ లతో రెడీ అవుతున్నారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తొలి మాస్ హిట్ ఒక్కడు మూవీ. మాస్ ఆడియన్స్ లో మహేష్ బాబు పేరు వినిపించడం ప్రారంభం అయింది ఈ చిత్రంతోనే. ఈ వీకెండ్ కి ఒక్కడు చిత్రం రీ రిలీజ్ అవుతోంది.
తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ హను మాన్ చిత్రాన్ని 3డి వెర్షన్ లో జూన్ 25న రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హీరో, డివోషనల్ కథాంశంతో పాన్ ఇండియా మొత్తాన్ని ఊపు ఊపేసింది.
మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచు విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రం ఈ వీకెండ్ కి రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇలా మహేష్, తేజ సజ్జా, మంచు విష్ణు వారి సినిమాల రీ రిలీజ్ తో వస్తున్నప్పటికీ మా ఇంటి బంగారం కలెక్షన్స్ కి వచ్చిన నష్టం ఏమీ లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే రీ రిలీజ్ చిత్రాలకు కేటాయించేది అతి తక్కువ థియేటర్స్ మాత్రమే. పైగా షోల సంఖ్య కూడా తక్కువ. కాబట్టి మా ఇంటి బంగారం చిత్రం సాలిడ్ గా తన రన్ కొనసాగించే అవకాశం ఉంది.