పిల్లల ముందు పేరెంట్స్ వాదనలు పెట్టుకోవద్దు. పిల్లల ముందు భార్యాభర్తలు తిట్టుకోవడం, అరవడం వల్ల వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. పిల్లల ముందు మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవద్దు.
దీని వల్ల పిల్లల్లో చాడీలు చెప్పడం అనే అలవాటు అలవడుతుంది.
పిల్లలను పట్టించుకోకుండా ఫోన్లు చూడటం వల్ల పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా సోషల్ మీడియా వైపు వెళ్లిపోతారు.
పిల్లల ముందు అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం కూడా మంచిది కాదు. చెడు మాటలను పిల్లలు అనుకరించే ప్రమాదం ఉంది.
పిల్లల ముందు ధూమపానం, మద్యపానం చేయడం మంచిది కాదు. పిల్లల ముందు సిగరెట్ తాగడం వల్ల వారు కూడా చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది.
పిల్లల ముందు ఇతరులను, తల్లిదండ్రులను తిట్టడం కూడా మంచిది కాదు. దీని వల్ల పిల్లలు కూడా ఇతరులను తిట్టడం ప్రారంభిస్తారు.
పిల్లల ముందే వారిని విమర్శించడం కూడా మంచిది కాదు. దీని వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
పిల్లల మందు ఇతరులకు ఇచ్చిన మాటలు తప్పడం కూడా సరైనది కాదు. మాట తప్పితే పిల్లల్లో కూడా అదే అలవాటు దెబ్బతింటుంది.
పిల్లల ముందు ఎక్కువ కోపం వ్యక్తం చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కూడా పెరిగే అవకాశం ఉంది.