
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ఏకంగా కింగ్ కోహ్లీని వెనక్కి నెడుతూ ప్రపంచపు అత్యుత్తమ నంబర్ 2 బ్యాటర్‌గా అవతరించాడు.
అంతకంటే ముందు గిల్ 5వ స్థానంలో ఉండేవాడు. కానీ, ఇటీవలె కాలంలో వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న గిల్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో ముగిసిన సిరీస్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. పైగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా నిలిచాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో గిల్ పాయింట్లు రైయ్ అంటూ దూసుకెళ్లాయి.
ప్రస్తుతం గిల్ 791 పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. గిల్ కంటే ముందు మొదటి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచ్చెల్ ఉన్నాడు. అతను 815 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా గిల్ కంటే ముందు రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. 768 పాయింట్లతో కోహ్లీ మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కంటిన్యూ అవుతున్నాడు. 754 పాయింట్లతో రోహిత్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఐదో ప్లేస్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 712 పాయింట్లతో ఉన్నాడు. మొత్తంగా టాప్ 5లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి