
భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో...
భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో (2026-27) విద్యా సంవత్సరానికి గాను మూడో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 2025-26 ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ నెల 27, 29, 30 తేదీల్లో నేరుగా అడ్మిషన్ ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.కే శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 6 గంటల వరకు కళాశాలకు చేరుకోవాలని, ఎంపిక ప్రక్రియ, అడ్మిషన్ల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని తెలిపారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి, ఉత్తీర్ణత సాధించి ఉండాలని అభ్యర్థి కనీస ఎత్తు 152 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని, ఎలాంటి కంటి దోషములు, ఆనారోగ్య సమస్యలు ఉండరాదని పేర్కొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారని, అభ్యర్థులు అందుకు అనుకూలంగా ఉండేలా ట్రాక్ ప్యాంటు, టీ-షర్ట్, షూస్ ధరించి రావాలని, అన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.