
సొట్టబుగ్గలు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులా? నవ్వినప్పుడు ముఖానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చే సొట్టబుగ్గలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాకుండా అదృష్టానికి కూడా సంకేతమా?
ఇంటర్నెట్ డెస్క్: సొట్టబుగ్గలున్న వారు అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. నవ్వినప్పుడు ముఖానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చే సొట్టబుగ్గలు అదృష్టానికి ప్రతీకగా కూడా భావిస్తారు. జ్యోతిష్యం, హస్తసాముద్రిక శాస్త్రాల ప్రకారం సొట్టబుగ్గలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, అదృష్టానికి కూడా సూచికగా పరిగణిస్తారు.
సొట్టబుగ్గలు ఉన్నవారు చిన్నప్పటి నుంచే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారని నిపుణులు చెబుతున్నారు. వీరికి మంచి జ్ఞాపకశక్తి, చురుకైన ఆలోచనా శక్తి ఉండటంతో సమాజంలో త్వరగా గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
ఇలాంటి వ్యక్తులు సాధారణంగా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొత్త పరిస్థితులను ఎదుర్కోవడంలో వీరు వెనుకడుగు వేయరని.. సమస్యలకు వెంటనే పరిష్కారం కనుగొనే నైపుణ్యం కూడా వీరికి ఉంటుందని అంటున్నారు.
చిన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే గుణం వీరిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
సొట్టబుగ్గలు ఉన్నవారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారని, ఖర్చులు-పొదుపుల విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారని విశ్వసిస్తారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించే స్వభావం కూడా వీరికి ఉంటుందని చెబుతారు.
అన్నీ అనుకూలంగానే ఉంటాయని కాదు. కొందరు తమ వ్యక్తిగత లేదా వైవాహిక జీవితంలో చిన్నచిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతరులను సులభంగా నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి
ఆహారం తిన్న పళ్లెంలో చేతులు కడుక్కోకూడదట.. ఎందుకో తెలుసా?