
ఐపీఎల్ 2027 సీజన్ కంటే ముందు ఒక భారీ ట్రేడ్ డీల్ జరిగింది. రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చాడు. ఈ మార్పు కోసం అతడు తన జీతంలో రూ.
12 కోట్ల తగ్గుతున్నా కూడా పంత్ లక్నోను వీడి ఢిల్లీకి వెళ్లేందుకే సిద్ధం అయ్యాడు. లక్నో తరఫున కెప్టెన్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పంత్, 2026 సీజన్లో కూడా నిరాశపరిచాడు. జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎల్ఎస్జీలో అతడి భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో పంత్ తిరిగి తన హోమ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు.
అయితే ట్రేడ్ పూర్తయిన వెంటనే పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని అక్షర్ స్వయంగా వెల్లడించాడు. తన బిడ్డతో సమయం గడుపుతున్న సమయంలో పంత్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేకపోయానని, తర్వాత తిరిగి కాల్ చేయగా పంత్ ఎంతో ఉత్సాహంగా “భాయ్, ఇది కన్ఫర్మ్ అయింది.. నేను తిరిగి వస్తున్నాను” అని చెప్పాడని అక్షర్ తెలిపాడు. పంత్ తిరిగి వస్తాడనే నమ్మకం తనకు ఎప్పటి నుంచో ఉందని అక్షర్ పేర్కొన్నాడు. “ఇంటిని వదిలి వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి వస్తే అతడిని తప్పిపోయినవాడని అనరు” అనే హిందీ సామెతతో పంత్ రాకను అక్షర్ అభివర్ణించాడు. పంత్‌పై తనకున్న అభిమానమే అతడిని మళ్లీ ఢిల్లీ జట్టులోకి తీసుకురావడానికి కారణమని కూడా వ్యాఖ్యానించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి