
JioBharat V4లో ఉన్న ప్రధాన ఆకర్షణ JioPay సపోర్ట్. దీని ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి నేరుగా UPI చెల్లింపులు చేయవచ్చు.
సాధారణంగా డిజిటల్ పేమెంట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ అవసరం ఉంటుంది. కానీ ఈ ఫోన్‌తో కీప్యాడ్ ఫోన్ నుంచే సురక్షితంగా ఆన్లైన్ లావాదేవీలు చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, చిన్న వ్యాపారులకు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఫోన్ కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. జియో 4G నెట్వర్క్ సహాయంతో వీడియోలు చూడొచ్చు. లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించడంతో పాటు సినిమాలు, క్రీడల హైలైట్స్ కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా 80 మిలియన్లకు పైగా పాటల లైబ్రరీ అందుబాటులో ఉండటంతో వినోదానికి ఎలాంటి కొరత ఉండదు. దీంతో ఇది సాధారణ ఫీచర్ ఫోన్, స్మార్ట్‌ఫోన్ మధ్య వారధిగా నిలుస్తోంది.
JioBharat V4లో ‘సేఫ్టీ షీల్డ్’ అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందించారు. JioThings యాప్ ద్వారా ఈ ఫోన్‌ను మరో స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేయవచ్చు. ఆ తర్వాత ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయడం, కాల్స్‌ను పర్యవేక్షించడం, కొన్ని సెట్టింగ్స్‌ను రిమోట్‌గా నియంత్రించడం సాధ్యమవుతుంది. అనుమానాస్పద కాల్స్‌ను బ్లాక్ చేసే సదుపాయం కూడా ఉంది. ఈ ఫీచర్లు పిల్లలు, వృద్ధుల భద్రత కోసం ఎంతో ఉపయోగపడతాయి.
JioBharat V4 వినియోగదారుల కోసం జియో ప్రత్యేకంగా రూ.123తో తక్కువ ధర రీచార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌ను జియో అధికారిక వెబ్సైట్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, జియో స్టోర్లు, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో 4G కనెక్టివిటీ, UPI పేమెంట్స్, వీడియో స్ట్రీమింగ్, లొకేషన్ ట్రాకింగ్, భద్రతా ఫీచర్లు కోరుకునే వారికి JioBharat V4 మంచి ఎంపికగా చెప్పొచ్చు.