
ఇండియాలో డిజిటల్ లైఫ్‌స్టైల్ చాలా వేగంగా మారిపోతోంది. మెట్రోలో వెబ్ సిరీస్‌లు చూడటం, వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడటం.. ఇలా ప్రతిదానికీ మ్యూజిక్, ఆడియో అనేవి మన లైఫ్‌లో భాగమైపోయాయి.
యూజర్లు ఇప్పుడు అన్ని అవసరాలను తీర్చే ఒకే ఒక పవర్ఫుల్ ఆడియో డివైజ్ కోసం చూస్తున్నారు. అయితే, ₹5,000 లోపల ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇయర్‌బడ్స్ దొరకడం ఇప్పటివరకు ఒక ఛాలెంజ్‌గా ఉండేది. కానీ, ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఓప్పో సరికొత్త ప్రొడక్ట్‌తో మన ముందుకు వచ్చేసింది.
డైలీ ఎంటర్టైన్మెంట్లో బెస్ట్ కంపానియన్‌గా ఉండేలా ఒప్పో తన లేటెస్ట్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఒప్పో ఎన్కో ఎయిర్5 ప్రో ని మార్కెట్లోకి తెచ్చింది. ఇమర్సివ్ ఆడియో, అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, స్మార్ట్ ఫీచర్లను చాలా తక్కువ ధరలోనే అందిస్తోంది.
భారతదేశంలో ₹4,999 ధరతో లాంచ్ అయిన ఈ ఒప్పో ఎన్కో ఎయిర్5 ప్రో, ప్రస్తుతం లభిస్తున్న బెస్ట్ ఆల్-రౌండర్ TWS ఇయర్‌బడ్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్, ఆడియో క్వాలిటీ, క్లియర్ కాల్స్, బ్యాటరీ లైఫ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఇది బెస్ట్ అనిపిస్తోంది. మెట్రో ప్రయాణాలు, ఓటీటీ సిరీస్‌లు, ఆఫీస్ మీటింగ్స్ లేదా బీజీఎంఐ లాంటి కాంపిటేటివ్ గేమ్స్.. ఇలా ఏ అవసరానికైనా ఈ ఇయర్‌బడ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి.
ఇయర్‌బడ్స్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ చూసే మెయిన్ ఫీచర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒప్పో ఎన్కో ఎయిర్5 ప్రో కేవలం డిస్ట్రాక్షన్స్ని దూరం చేయడమే కాదు, మీకు నచ్చిన మ్యూజిక్ ప్రపంచంలో మిమ్మల్ని ముంచేస్తుంది. ఇది 5000Hz అల్ట్రా-వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఏకంగా 55dB ANCని అందిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇయర్‌బడ్స్‌లో కూడా ఇలాంటి స్పెసిఫికేషన్ చూడటం చాలా అరుదు.
చాలా ఇయర్‌బడ్స్ చుట్టుపక్కల ఉండే హెవీ సౌండ్స్‌ని మాత్రమే ఆపగలవు, కానీ ఈ ఒప్పో ఎన్కో ఎయిర్5 ప్రో లోని 5000Hz రేంజ్.. మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే మిడ్-ఫ్రీక్వెన్సీ గోలని కూడా సమర్థంగా అడ్డుకుంటుంది. దీని ANC టెక్నాలజీ వాతావరణానికి తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా అడాప్ట్ అవుతుంది.
ఇందులో 'అడాప్టివ్ విండ్ నాయిస్ రిడక్షన్' ఫీచర్ ఉంది. దీనివల్ల మీరు బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు లేదా బయట గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్‌గా మాట్లాడుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ గాలి శబ్దానికి, చుట్టుపక్కల ఉండే నార్మల్ సౌండ్స్‌కి మధ్య తేడాని స్మార్ట్‌గా గుర్తించి ఆడియో క్వాలిటీ తగ్గకుండా చూస్తాయి.
ఒప్పో ఎన్కో ఎయిర్5 ప్రో లో 12mm టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్ ఇచ్చారు. ఇది నార్మల్ పాలిమర్ డ్రైవర్ల కంటే బెటర్ బేస్ కంట్రోల్, తక్కువ డిస్టార్షన్, క్లీన్ హై-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ని ఇస్తుంది. దీనివల్ల మీరు సాంగ్స్ వింటున్నప్పుడు మ్యూజిక్‌లోని ప్రతి లేయర్, ప్రతి డీటెయిల్ చాలా రిచ్‌గా వినిపిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ ఫ్లాట్‌గా కాకుండా చాలా లైవ్‌గా, స్పేషియల్ టెక్స్చర్తో థియేటర్ ఫీలింగ్‌ను అందిస్తాయి. మన ఇండియన్ యూజర్ల టేస్ట్‌ను మైండ్‌లో పెట్టుకుని ఒప్పో ఈ సౌండ్ సిగ్నేచర్‌ను ట్యూన్ చేసింది.
ఒకవేళ మీకు వేరే లాంటి బ్యాలెన్స్ కావాలనుకుంటే, 'Hey Melody' యాప్‌లోని 'Sound Master EQ' ద్వారా మూడు ప్రీసెట్స్ వాడుకోవచ్చు. బ్యాలెన్స్డ్ సౌండ్ కోసం 'Ultimate Sound', పాడ్‌కాస్ట్‌లు, మెలోడీల కోసం 'Pure Vocals', అలాగే హెవీ బేస్ కావాలనుకునే వారి కోసం 'Thundering Bass' మోడ్స్ ఉన్నాయి. వీటిని మ్యాన్యువల్ EQ కంట్రోల్స్ ద్వారా మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు.
గేమర్స్ కోసం ఇందులో 'OPPO Alive Audio' ఫీచర్ ఇచ్చారు. ఇది స్పేషియల్ ఆడియో అల్గారిథమ్స్‌ని ఉపయోగించి గేమ్ ఆడుతున్నప్పుడు ఎనిమీస్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారా లేక బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారా అనే విషయాన్ని శబ్దాల ద్వారా క్లియర్‌గా చెప్తుంది. 'Game Sound Effects' మోడ్ ప్రత్యేకంగా గేమింగ్ కోసమే ఆప్టిమైజ్ చేశారు. ₹5,000 లోపు హై-రెస్ ఆడియో సపోర్ట్ చేసే 12mm డ్రైవర్ ఉండటం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది.
ఇందులో సరికొత్త బ్లూటూత్ 6.0 (Bluetooth 6.0) కనెక్టివిటీ ఉంది. ఇది పాత జనరేషన్ బ్లూటూత్ కంటే ఎక్కువ స్టెబిలిటీ, తక్కువ లాటెన్సీ, ఫాస్ట్ రీకనెక్టివిటీని అందిస్తుంది. ఇక ఇందులోని 'డ్యూయల్-కనెక్ట్' ఫీచర్ ద్వారా మీరు ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ అవ్వచ్చు. లాప్టాప్లో వర్క్ చేస్తూనే, ఫోన్‌కి వచ్చే కాల్స్‌ని అటెండ్ చేయడానికి ఇది చాలా యూజ్‌ఫుల్ ఫీచర్.
కాల్స్ మాట్లాడటం కోసం ఇందులో 'ట్రిపుల్-మైక్ ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్' టెక్నాలజీ ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిలో కూడా ఈ ఏఐ ప్రాసెసింగ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని కట్ చేసి, స్పీకర్ వాయిస్‌ని స్థిరంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇందులో 'ఏఐ ట్రెండ్స్లేట్' ఫీచర్ కూడా ఉంది, ఇది వేరే భాషలు మాట్లాడే ప్రాంతాలకు ట్రావెల్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.
ఒప్పో ఎన్కో ఎయిర్5 ప్రో కేస్, ఇయర్‌బడ్స్ కలిపి టోటల్‌గా 54 గంటల భారీ ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. అంటే మీరు రోజుకు 3 నుంచి 4 గంటలు వాడినా సరే, దాదాపు రెండు వారాల పాటు మళ్లీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా 4 గంటల పాటు ప్లేబ్యాక్ వస్తుంది.
1,000 ఛార్జ్ సైకిల్స్ లేదా ఐదేళ్ల పాటు ప్రతిరోజూ ఛార్జ్ చేసినా సరే బ్యాటరీ హెల్త్ అస్సలు తగ్గదు. ఇందులో IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. కాబట్టి వర్షం, చెమట, లేదా దుమ్ము వల్ల వీటికి ఏమీ కాదు. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.4 గ్రాములు మాత్రమే, అందుకే రోజంతా పెట్టుకున్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.
మొత్తంగా చూసుకుంటే, ₹4,999 బడ్జెట్లో 55dB ANC, బ్లూటూత్ 6.0, 54 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఈ సరికొత్త OPPO Enco Air5 Pro ఇయర్‌బడ్స్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో అధికారిక ఈ-స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు.