అరోమాథెరపీలో నిమ్మగడ్డి ఆయిల్ బెస్ట్ అని అధ్యయనాలు చెబుతున్నాయి. నిమ్మగడ్డి నూనెలో యాంటీడిప్రెసెంట్ గుణాలు ఉన్నాయని NLM అధ్యయనం పేర్కొంది. ఇది మన మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నిమ్మగడ్డితో చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.
దీని వాసన శరీరంలో సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్ల విడుదల కావడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇది ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. అంతేకాదు, మంచి నిద్ర కూడా పడుతుంది. మీరు పడుకునే ముందు బెడ్ రూమ్‌లో డిఫ్యూజర్‌లో నిమ్మగడ్డి నూనె వేసి ఉంచండి. మీకు హాయిగా నిద్రపడుతుంది.
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఒత్తిడి, యాంగ్జయిటీని తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయని AJRC అధ్యయనం పేర్కొంది. దీన్ని హీమోడయాలసిస్ పేషెంట్స్‌కు, మైగ్రేన్లు, నిద్రలేమితో బాధపడేవారికి నయం చేయడానికి చేసే అరోమాథెరపీలో వాడతారు. లావెండర్ ఆయిల్ అలసట, తలనొప్పి దూరం చేస్తుంది. మీ ఇంట్లో డిఫ్యూజర్‌లో వేసి ఉంచితే.. మీ ఒత్తిడిని దూరం చేస్తుంది.
మల్లెపూల సువాసన అంటే నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి. దీని నుంచి తీసిన ఈ ఎసెన్షియల్ ఆయిల్‌కి మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. దీని వాసన నాడీ సంబంధిత ఒత్తిడిని, డిప్రెషన్‌ను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీని సువాసన రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. ఈ నూనెను రాత్రిపూట మీరు నిద్రపోయేప్పుడు బెడ్ రూమ్‌లో డిఫ్యూజర్‌లో వేసి ఉంచండి. హాయిగా నిద్రపడుతుంది.
రోజ్ ఆయిల్ మీలోని విసుగు, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వాసన మనలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఇంటి వాతావారణాన్ని ప్రశాంతంగా మారుస్తుంది.
ఈ టీ ట్రీ ఆయిల్లో క్రిమిసంహారక గుణాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియాను, దుర్వాసనను దూరం చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలు, మొటిమలు, జుట్టు సమస్యలను తగ్గించడంలో కూడా పనిచేస్తుందట. అయితే ఇది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ దీనిని నేరుగా చర్మంపై రాయకూడదు.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి