
Deportation| ఇంటర్నెట్‌డెస్క్: డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది.
నైతిక దుష్ర్పవర్తనకు పాల్పడితే శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు అయినా సరే దేశం నుంచి బహిష్కరించేలా ప్రభుత్వానికి ఉన్న అధికారాలను యూఎస్ సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఆ కేసుల్లో ఆ నేరం జరిగిఉండొచ్చని నమ్మడానికి బలమైన కారణం ఉన్నట్లు అధికారులు నిర్ధరించాల్సి ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత నివాసితులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు ఎంట్రీ పాయింట్ల వద్దే అమెరికా (USA)లో ప్రవేశానికి నిరాకరించేలా ఈ తీర్పు అనుమతిస్తోంది. దేశం నుంచి డిపోర్ట్ చేయడానికి బోర్డర్ ఏజెంట్ల అధికారాలకు మరింత బలం చేకూరుస్తోంది.
నకిలీ ట్రేడ్‌మార్క్‌కు సంబంధించి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన చైనా జాతీయుడు మక్ చోయ్ అభియోగాలు నమోదయ్యాయి. దాంతో 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగిరాగా.. దేశంలోకి ప్రవేశించేందుకు అధికారులు నిరాకరించారు. తర్వాత కఠిన షరతులతో ప్రవేశానికి అనుమతించారు. తర్వాత తాను తప్పు చేసినట్లు మక్ చోయ్ అంగీకరించాడు. దాంతో అతడిని దేశం నుంచి బహిష్కించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. తాను చేసిన నేరం నైతిక దుష్ప్రవర్తన కిందికి కాదని అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ అతడికి యూఎస్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఇరాన్ యుద్ధం (Iran War) విషయంలో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో మోహరించిన బలగాలను వెనక్కి తీసుకురావాలని, సైనిక చర్యలను ఆపివేయాలని ఆదేశించే తీర్మానికి అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి 50-48 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.