
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Shiva Yogam Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలతో పాటు నక్షత్రాల కలయికల వల్ల ఏర్పడే శుభ యోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఇదిలా ఉంటే జూన్ 24 నుంచి అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన శివయోగం ప్రారంభమైంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. జూన్ చివరి వారం నాటికి ఈ శివయోగ ప్రభావంతో ఏకంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైమ్ ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శివయోగం అంటే ఏమిటి? జ్యోతిష్యపరంగా శివయోగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, సానుకూల ప్రభావంతో పాటు శక్తిని ఇచ్చే సమయంగా భావిస్తూ ఉంటారు.. ఈ సమయంలో చేసే పూజలతో పాటు జపాలు లేదా కొత్త పనులు నేరుగా పరమశివుని అనుగ్రహాన్ని పొందుతాయని ఒక నమ్మకం.. అలాగే ఈ సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ తిరిగి వేగంగా ప్రారంభం కావడానికి, జీవితంలో స్థిరత్వాన్ని సాధించడానికి ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది.
అదృష్ట రాశులు ఇవే: మేష రాశి (Aries): ఈ శక్తివంతమైన శివయోగం ప్రభావంతో మేష రాశి వారికి ఈ సమయం కొత్త ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి విషయాల్లో సానుకూల మార్పులు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
మిథున రాశి (Gemini): గతంలో కంటే ఇప్పుడు మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పనిలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారిరి ఈ సమయంలో తప్పకుండా కొత్త ప్రాజెక్టులను పొందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది.
సింహ రాశి (Leo): శివయోగం ఎఫెక్ట్‌తో సింహ రాశివారికి నిర్ణయాత్మక శక్తి, మేధోసంపత్తి అద్భుతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతటి కష్టమైన సవాళ్లనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఆర్థికంగా భారీ లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి..
తులా రాశి (Libra): మోస్ట్ పవర్ఫుల్ శివయోగం ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయంలో మనసిక ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. పాత పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా వీరు జాక్‌ఫాట్ మనీ కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే భౌతికంగా కూడా సుఖాలు కూడా పెరుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius): శివయోగం ప్రభావంతో ధనుస్సు రాశివారికి వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సమాజం నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక వనరులు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు అనుకోకుండా వస్తున్న సమస్యలు కూడా సరిష్కారం అవుతాయి.
(గమనిక: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలతో పాటు ఇంటర్నెట్ ఆధారంగా అందించారు. దీనిని కేవలం సమాచారం కోసమే చదవాల్సి ఉంటుంది.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.