
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Rare Vyatipata Yogam Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల సంయోగంతో పాటు ప్రత్యేక స్థితుల వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాలను ఎంతోగానో ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై నెలలో ఒక అత్యంత అరుదైన, శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది.. జూలై 10న సూర్యుడు, చంద్రుల కలయిక వల్ల వ్యతీపాత యోగం ఏర్పడబోతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని గౌరవ మర్యాదలతో పాటు ఆత్మవిశ్వాసానికి కారకుడు భావిస్తారు.. ఇక చంద్రుడిని మనస్సుతో పాటు ఆనందానికి కూడా కారకుడిగా చెప్పకుంటారు. ఈ ఇద్దరి కలయికతో జూలై 10న ఉదయం 06:53 గంటలకు ఈ వ్యతీపాత యోగం ఏర్పడబోతోంది.. కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే ఉండే ఈ ప్రత్యేక యోగం ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాన్ని పూర్తిగా మార్చుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఊహించని ధనలాభాలు కలుగుతాయి.
ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే: వృషభ రాశి (Taurus): మోస్ట్ పవర్ఫుల్ వ్యతీపాత యోగంతో వృషభ వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా నిలిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. అలాగే ఆఫీసుల్లో కష్టపడి పనులు చేసేవారికి ఊహించని ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు అదృష్టం కూడా వెంట, వెంటనే లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం విపరీంగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి.. ఆదాయ వనరులు గణనీయంగా లభిస్తాయి..
సింహ రాశి (Leo): సింహ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. కుటుంబంలో ఉన్న విభేదాలు, సమస్యలు అన్నీ ఒక్కసారిగా నిలిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో మీ ప్రతిష్ఠలు కూడా విపరీతంగా పెరుగుతాయి.. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశాలు లభిస్తాయి.. సమాజంలో ఉన్నత వ్యక్తుల సపోర్ట్ లభించడం వల్ల మీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
తులా రాశి (Libra): ఈ అరుదైన యోగం ప్రభావంతో తులా రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. మీ జీవితం ఒక అద్భుతమైన దిశలో ముందుకు సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి చేతికి డబ్బు అందుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పైఅధికారుల నుంచి పూర్తి సపోర్ట్ లభించి.. ప్రశంసలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో మధురంగా ఉంటుంది.. అయితే, ఈ సమయంలో అతి ఆత్మవిశ్వాసానికి పోకుండా జాగ్రత్త వహించడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మకర రాశి (Capricorn): మకర రాశివారికి ఈ సమయం గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని.. వ్యాపార రంగంలో ఉన్నవారికి దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి విస్తరణ అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఈ సమయంలో తప్పకుండా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఆందోళన వంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
(గమనిక: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అందించిన అంచనాలు మాత్రమే.. ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా అందిచాము. దీనిని ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.