
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు.
అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Trisha Krishnan:తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విజయ్ ఈమధ్య తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే హీరోయిన్ త్రిష కృష్ణన్ నుంచి శుభాకాంక్షలు రాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
గత కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ప్రత్యేక పోస్టులు పెడుతూ వస్తోంది. ఈసారి మాత్రం జూన్ 22న ఆమె ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరు వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని కూడా ప్రచారం చేశారు. అంతేకాకుండా త్రిష విజయ్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
అయితే ఈ వార్తలన్నింటికీ త్రిష ఒకే పోస్టుతో చెక్ పెట్టింది. జూన్ 23 సాయంత్రం ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో విజయ్ ఎంతో ఆనందంగా కనిపించగా, త్రిష ఆయనను చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. వారి ముందు పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన కేకులు కూడా కనిపించాయి.
ఆ ఫొటోకు త్రిష ఎంతో ప్రేమతో కూడిన సందేశాన్ని జత చేసింది. “అన్నింటినీ విలువైనవిగా మార్చే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఆమె రాసింది. అంతేకాకుండా దానికి 0:00 అని పెట్టింది అంతే అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కటింగ్ చేసినట్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వేగంగా వైరల్ అయింది.
త్రిష గతంలో కూడా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఫొటోలు పంచుకుంది. 2023లో ‘లియో’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను షేర్ చేసింది. 2024లో ఇద్దరూ కలిసి ఉన్న మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. 2025లో విజయ్ తన పెంపుడు జంతువుతో ఆడుకుంటున్న ఫొటోను పంచుకుని శుభాకాంక్షలు తెలిపింది.
ఈసారి కూడా కొంత ఆలస్యంగా అయినా త్రిష విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పడంతో అన్ని సందేహాలకు తెరపడింది. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు నిజం కాదని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేసిన ఈ పోస్ట్ తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు కూడా ఈ ఫొటోపై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.