
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Aha OTT New Programme: సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీలో సరికొత్గా టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా ఉండనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆహా కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం మన సమాజం మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఫుడ్, ఫ్యాషన్, టూరిజం..ఇలా ప్రతి విషయంలో వాళ్లు చెప్పేది మనం ఫాలో అవుతున్నాము. అంత ప్రభావం వాళ్లు సొసైటీ మీద చూపిస్తున్నారు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేస్తున్న ఒక యూనిక్ షో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. ఇలాంటి కార్యక్రమం ఇప్పటిదాకా రాలేదు. ఈ కార్యక్రమం కోసం ఎంట్రీలను ఆహ్వానించాము. ఈ షో కు మంచు లక్ష్మి, వైవా హర్ష ఇద్దరు పర్పెక్ట్ హోస్టులు. వారి ద్వారా ఈ కార్యక్రమం మరింతగా ఆడియెన్స్ కు చేరువుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
జ్యూరీ మెంబర్ మంచు లక్ష్మి మాట్లాడుతూ.. కోర్ టీమ్ అంతా మహిళలే ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య వ్యత్యాసం ఉంది. ఆహా వాళ్లు ఈ కార్యక్రమాన్ని ఏదో ఒకటి చేద్దామని చేయడం లేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేస్తున్నారు. ఈ షో ఔట్ పుట్ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. కార్యక్రమం చూశాక మీరు కూడా అమేజింగ్ అనుకుంటారు. కంటెండర్స్ ఎవరూ తక్కువ కాదు. ఈ కార్యక్రమంలో విన్నర్ ఎవరైనా పాల్గొనే ప్రతి ఒక్కరూ నా దృష్టిలో టాప్ లో ఉండేవారే. మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. ఈ షో కోసం ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నా. ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్న ఆహాకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.
జ్యూరీ మెంబర్ రష్మి మాట్లాడుతూ - ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అందరితో పరిచయం ఉన్నవారే. చాలా పాపులర్ అయినవారే. పాండమిక్ తర్వాత సామాజిక మాధ్యమాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్ఫుయెన్సర్స్ ఇంపాక్ట్ చాలా పెరిగిపోయింది. ఏది బ్రాండింగ్ చేస్తున్నా వాళ్ల మీద ఒక బాధ్యత కూడా ఉంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక యూనిక్ షో ప్లాన్ చేసింది ఆహా. ఈ కార్యక్రమం గురించి రెండు రోజుల ముందటే చెప్పారు. ఇంత గ్రాండ్ ఈవెంట్ ఉంటుందని అనుకోలేదని చెప్పారు. మంచు లక్ష్మి, వైవా హర్ష గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింతగా ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు మేము ప్రయత్నిస్తామన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.