
లండన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్‌లో భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్ టీమ్‌పై 4-3 గోల్స్ తేడాతో గెలుపొందింది.
Jun 23 2026 10:01 PM | Updated on Jun 23 2026 10:01 PM
లండన్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్‌లో భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్ టీమ్‌పై 4-3 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. భారత్ తరఫున అభిషేక్, రాజిందర్, నీలకంఠ, సుఖ్జీత్ గోల్స్ చేశారు.
మంచి ఫామ్‌ను కొనసాగించిన భారత్ ఈ మ్యాచ్‌కు ముందు భారత్ నెదర్లాండ్స్‌పై 3-2తో అద్భుత విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. యూరప్ లెగ్‌లో తొలి ఓటమి తర్వాత జట్టు గణనీయంగా పుంజుకుని జర్మనీ, నెదర్లాండ్స్‌లాంటి బలమైన జట్లపై విజయాలు నమోదు చేసింది.
క్రెయిగ్ ఫుల్టన్ శిక్షణలో భారత జట్టు రక్షణ, దాడి విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా చివరి కొన్ని మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలు రాబడుతున్నారు.
పాక్‌కు మరో నిరాశ ఇప్పటికే టోర్నీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న పాక్‌కు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు.. పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. పాక్ రెలిగేషన్ ప్రమాదం నుంచి బయటపడాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక విజయాలు సాధించాలి.
మిగిలిన మ్యాచ్‌లు ఈ టోర్నీలో భారత్ మరోసారి పాక్‌తో తలపడాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లోనూ భారత్ మెరుగైన ఫలితాలు సాధించి సీజన్‌ను సానుకూలంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)
ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు)
Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!
ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర
డబ్బు కోసమే రైల్వే ఎంప్లాయ్ ట్రాప్..! వైరల్ అవుతున్న ఆడియో