
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జయరాం కోమటి డాలస్ నగరంలో పర్యటించారు.
పర్యటనలో భాగంగా అర్వింగ్‌లో ఉన్న అమెరికాలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ స్మారకం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యులు అనంత్ మల్లవరపు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాపికతో సన్మానించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ గుళ్లపల్లి, పలువురు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. ‘‘పుష్కరకాలం పూర్తిచేసుకుంటున్న గాంధీ స్మారక స్థలి కేవలం ప్రవాస భారతీయులకే కాకుండా ఇతర దేశస్థులు సైతం సందర్శించే ఓ స్ఫూర్తిదాయక ప్రదేశం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, అమెరికా నేతలు కూడా ఈ స్మారకాన్ని సందర్శించారు. ప్రవాస భారతీయుల ఐక్యతకు ఇది నిలువెత్తు నిదర్శనం. దీన్ని రూపొందించడంలో విశేష కృషి చేసిన గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా.ప్రసాద్ తోటకూర, కార్యవర్గ బృందానికి ప్రత్యేక అభినందనలు’’ అని జయరాం కోమటి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.