
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 165 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
రాకేశ్ (38*; 34 బంతుల్లో) టాప్ స్కోరర్. నితిన్ (28*), ఆరోన్ జార్జ్ (27), అవనీశ్ (25), తనయ్ త్యాగరాజన్ (21) పరుగులు చేశారు. మెదక్ బౌలర్లలో వరుణ్ రెండు వికెట్లు, తేజ, ఘాజీ, అహ్వినన్ చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మెదక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఐదో స్థానంలో వచ్చిన విక్రమ్ నాయక్ (49; 38 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్ సాయి పుర్ణానంద్రావు (38), నమన్ అగర్వాల్ (37), సూర్యతేజ (10) పరుగులు చేశారు. రంగారెడ్డి బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 3, కరియప్ప 2, తనయ్ జడ్డూ 2, అరుణ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారత టీ20 జట్టుకు ఎంపికవ్వడంపై టీనేజ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ స్పందించాడు.
టీజీ20 లీగ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ గడుగు గణేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.