
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కూటమి ఐక్యతను కాపాడేందుకు మంత్రులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అమరావతి: కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్‌ను వైసీపీ వెనకేసుకొస్తూ రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు కుల మీటింగ్‌లు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రల్ని దీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కర్నూలులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావించిన సీఎం, గ్రామస్థులే బహిష్కరించిన వ్యక్తులకు వైసీపీ మద్దతుగా నిలవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అనవసర వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి సందర్భాల్లో కూటమి ఐక్యతను చాటే విధంగా మంత్రులంతా స్పందించాలని సూచించారు.
ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సీఎం కీలక ప్రకటనలు చేశారు. జొన్నగిరి గ్రామాన్ని ‘స్వర్ణ గ్రామం’గా నామకరణం చేయాలని ప్రతిపాదించారు. అలాగే జూలై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి: రఘురామకృష్ణంరాజు
టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం.. ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు