
అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు రూ.34వేల కోట్ల పెట్టుబడుల స్థాపన ద్వారా 35వేల ఉద్యోగాల కల్పన సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
అమరావతిలో ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మొదటి, రెండో దశ కోసం సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లకు సంబంధించి 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
జగన్ కబంధ హస్తాల్లో వైకాపా కాపు నేతలు ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.