
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar)తో ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)...
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar)తో ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంయుక్తంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ, తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw)తో నిన్న సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశమై ఐఆర్ఎఫ్సి రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్‌తో జరిగిన సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.