రేపటి లోగా శ్రీవల్లి కడుపుబాగోతాన్ని తేల్చాస్తానంటూ నిన్నటి ఎపిసోడ్లో శపథం చేసింది నర్మద. మరి తేల్చిందా? లేదా? నేటి (జూన్ 23) ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం.
డెలివరీ బాయ్ వచ్చి నర్మదకి ఒక పార్శిల్ ఇస్తాడు. దాన్ని చూసి శ్రీవల్లి.. వామ్మో ఈ పార్శిల్లో ఏముందో ఏంటో అని కంగారు పడిపోతుంటుంది. హా ఏంటీ మొగుడు పెళ్లాలిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించేసరికి ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడుతున్నారుగా.. ఇంతకీ ఏంటో ఇదీ అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో ధీరజ్ తగులుకుంటాడు. ‘హలో నిప్పు రవ్వ వదినోయ్.. నర్మద వదినకు లక్షల్లో జీతం వచ్చినా అత్యాశకి పోదు, ఆర్భాటాలకు అస్సలేపోదు.. మాకు కోట్ల ఆస్తులున్నాయ్ అని బిల్డప్పూ ఇవ్వదు. కానీ కొంతమంది ఉంటారులే.. కోట్లు ఆస్తులన్నాయని అబద్దాలాడి మోసాలు చేస్తుంటారులే.. వాళ్ల మన కళ్ల ముందే తిరుగుతుంటారులే’ అని గాలి తీసేస్తాడు ధీరజ్. ఇదిగో నువ్వు నన్నే అంటున్నావ్ అని నాకు బాగా అర్థమైంది కానీ.. ఇంతకీ ఈ డబ్బా ఏంటి చెల్లాయ్’ అని అడుగుతుంది శ్రీవల్లి. అదీ మెషీన్ అక్కాయ్ అని అంటుంది నర్మద. ‘హో కుట్టు మిషనా? అని శ్రీవల్లి అంటే.. ‘లేదు నిజాన్ని కక్కించే మెషీన్’ అని అంటుంది నర్మద.ఇది ఫస్ట్ నీపైనే ప్రయోగిస్తాం.. నిజాన్ని కక్కిస్తాం దెబ్బకి గుండెజారి గుప్పెట్లోకి వచ్చేస్తుంది శ్రీవల్లికి. గుడ్లు తేలేసేసి.. ‘ఏంటీ నిజాలు కక్కించే మెషీనా? ఇక్కడ అంతా హరిశ్చంద్రులే కదా.. దానితో మనకేం అవసరం? అని అడుగుతుంది శ్రీవల్లి. ‘చాలా ఉంది అక్కాయ్..ఈ మధ్య చాలామంది నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నారు.. వాళ్ల బాగోతం బయటపెట్టాలంటే ఈ మెషీన్ ఉండాలి మరి. ఫస్ట్ నీపైనే ట్రై చేద్దాం రా అక్కా అని అంటుంది నర్మద. ఇంతలో సుకన్య వచ్చి.. ‘నిన్ను మీ ఆయన పిలుస్తున్నాడు’ అని చెప్పి శ్రీవల్లిని ఆ గండం నుంచి తప్పిస్తుంది. ఇప్పుడు ఈ మెషీన్ ఎందుకు వదినా అని ధీరజ్ అంటే.. ‘వల్లీ దాస్తున్న నిజాలను కక్కించే టైమ్ వచ్చేసింది ధీరజ్.. కక్కిస్తా’ అని అంటుంది నర్మద. దొరికిపోతానని భయంగా ఉందే.. ఆ మాట విన్న సుకన్య.. ‘వల్లీపై పెద్ద ప్లానే వేశారు’ అంటూ శ్రీవల్లి దగ్గరకు పరుగుతీస్తుంది. అటు శ్రీవల్లి గదిలోకి పరుగుతీస్తుంది. ఆమెను చూసిన చందు.. ‘నువ్వు ఇలా పరుగెత్తుకుని రావడానికి ఒట్టి మనిషివి అనుకుంటున్నావా? అని అంటాడు. ఒట్టి మనిషిని కాకపోతే ఏంటి బావా? అని అంటుంది శ్రీవల్లి. అదేంటి నువ్వు కడుపుతో ఉన్న విషయం మరిచిపోయావా? నువ్వు అసలే తింగరి మేళం.. కాస్త జాగ్రత్తగా ఉండు’ అని కడుపులో ఉన్న బిడ్డకి బై బై చెప్పేసి బయటకు వెళ్తాడు చందు. అతను అలా వెళ్లాడో లేదో.. సుకన్య ఎంట్రీ ఇస్తుంది. నర్మద నీ మీద గట్టి ప్లానింగే చేసింది. నీతో నిజం చెప్పించి.. నీ కడుపు బాగోతాన్ని బయటపెట్టడానికే ఆ నిజాన్ని చెప్పించే మెషీన్ రప్పించింది.. వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నా’ అని అంటుంది సుకన్య.దానికి ఇస్తా చూడు రివర్స్‌లో కౌంటర్.. హమ్మ శ్రీవల్లీ ఈ మెషీన్ దెబ్బకి నీ కడుపు నాటకం బయటపడిపోతుందే వల్లీ అని అంటుంది సుకన్య. దానికి పెద్దగా నవ్విన శ్రీవల్లి.. ‘అది నా బాగోతం బయటపెట్టడం కాదు.. నేనే దానికి రివర్స్‌లో షాక్ ఇవ్వబోతున్నాను. నోరు ఎత్తితేనే కదా.. నాతో వాళ్లు నిజం చెప్పించేదీ.. నేను ఈరోజు నుంచీ మౌనవ్రతం.. అప్పుడు నాతో నిజం ఎలా చెప్పిస్తారూ.. వల్లీ మౌన వ్రతం స్టార్ట్స్ నౌ’ అని అంటుంది శ్రీవల్లి. అటు నర్మద, ప్రేమలు ఆ నిజం చెప్పించే మెషీన్‌ని ఓపెన్ చేస్తారు. ఇంతలో ధీరజ్ వచ్చి.. ‘నర్మద వదినా.. పొరపాటున ఈ మెషీన్ నా తింగరిపెళ్లానికి పెట్టావ్.. మా పెళ్లి గురించి నిజం చెప్పేస్తుంది’ అని అంటాడు. ఇంతలో వేదవతి వచ్చి.. ఏంట్రా ఈ మెషీన్.. ఏదో బాంబులు పెడుతున్నట్టు పెడుతున్నారూ’ అని అంటుంది. ఏంటీ మాట్లాడటం లేదూ.. నోరు పడిపోయిందా ఏంటీ అటు శ్రీవల్లితో పాటు.. సుకన్య వచ్చి.. ‘ఫ్లాప్ అయ్యే సినిమాకి ఈ భారీ ప్రచారం ఎందుకో’ అని అంటుంది. మిమ్మల్ని పట్టించడానికి అని ప్రేమ అంటే.. బల్లక్కాయ్ నువ్వే నన్ను గెలిపించాలి నిజాలు చెప్పి అని అంటుంది నర్మద. నిన్ను గెలిపించడం ఏంటీ అని సుకన్య అడుగుతుంది. ‘ఏం లేదూ.. నేను ప్రేమ పందెం వేసుకున్నాం.. బల్లక్కాయ్ నోరు తెరిస్తే అబద్దాలు చెప్తుందని ప్రేమ.. లేదూ ఆమె నిజం అనే మాటకి నిక్ నేమ్.. ఆమె హరిశ్చంద్రుడి వంశంలో ఆఖరి సంతానం అని నేనూ పందెం వేసుకున్నాం.. కాబట్టి నువ్వే నన్ను గెలిపించాలి అని అంటుంది నర్మద. శ్రీవల్లి ఎంతకీ మాట్లాడకపోయేసరికి.. ఏంటీ మెషీన్ చూసి నోరు పడిపోయిందా? ఏంటీ అని అంటుంది ప్రేమ. నా తల్లే.. నా తల్లే.. ఎంత మంచి పని చేశావో హో మీకు తెలియదా.. శ్రీవల్లి మౌన వ్రతం చేస్తుంది అని అంటుంది సుకన్య. ఈడెన్గా ఈ మౌనవ్రతం స్కీమ్ ఏంటో అని ధీరజ్ అంటే.. పుట్టబోయే బిడ్డకోసం అని అంటుంది సుకన్య. శ్రీరామా శ్రీరామా.. కడుపులో బిడ్డ కోసం వ్రతం చేస్తుందా? నా తల్లే నా తల్లే ఎంత మంచి పని చేస్తున్నావే.. నా బంగారం అంటూ శ్రీవల్లిని ముద్దాడేస్తుంది వేదవతి. అది చూసి శ్రీవల్లి.. ‘ఇది పెద్ద సైజ్ అమాయకురాలు.. నన్ను గుడ్డిగా నమ్మేస్తుంది’ అని అనుకుంటుంది. ఇక నర్మద అయితే.. ‘మౌనవ్రతం స్కీమ్ వేశావ్ కదా.. నీతో నోరు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు’ అని అనుకుని.. ‘చూడు బల్లక్కాయ్.. నీకు అదృష్టం లేదు.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యావ్. ప్రేమ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందని తెలియజెప్పే అవకాశాన్ని మిస్ అయ్యావ్.. నీ మౌనవ్రతం వల్ల’ అని అంటుంది. మెషీన్ అరుస్తోంది అక్కడా.. నీ బురిడీలకు నేను పడనుగా అని అనుకుంటుంది శ్రీవల్లి. సర్లే అత్తయ్య గారూ.. అసలు ఈ మెషీన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.. ఒకసారి మీరు కూర్చోండి అత్తయ్య గారూ అంటూ వేదవతిని కూర్చోబెట్టి.. మీ పెద్ద కోడలు ఎలాంటిది? అని అడుగుతుంది నర్మద. మంచిదే కానీ అని వేదవతి అనేసరికి మెషీన్ అరుస్తుంది. దాంతో వేదవతి.. మనిషి మంచిదే కానీ.. గుణమే కాస్త తేడా అని అంటుంది. అప్పుడు మెషీన్ ఆల్ రైట్.. ఆల్ రైట్ అని అంటుంది. ఆ తరువాత శ్రీవల్లి వంకర బుద్ధి మొత్తం ఒక్కొక్కటిగా చెప్తుంది వేదవతి. అన్నింటికీ ఆల్ రైట్.. ఆల్ రైట్ అని అరుస్తుంది మెషీన్. ఆ తరువాత రెండో కోడలు, మూడో కోడలు గురించి కూడా చెప్తూ ఉంటుంది వేదవతి. నర్మదకి వాయింపు.. మెషీన్ ఏంటీ ఇలా చెప్తుందీ నా రెండో కోడలు మంచిది బంగారం అని అంటే.. మెషీన్ అరుస్తూ ఉంటుంది. మీ మనసులో నా గురించి ఒక్కటి కూడా మంచి అభిప్రాయం లేదన్నమాట అని అలుగుతుంది నర్మద. అమాయకుడైన నా కొడుకుని కొంగున కట్టేసుకుని ఆడిస్తుంది అని వేదవతి అంటే.. మెషీన్ ఆల్ రైట్ అని అంటుంది. ఇంటి పెత్తనం చేయాలని చూస్తుంది అని వేదవతి అనేసరికి మెషీన్ రైట్ రైట్ అని చెప్పేసరికి.. కడుపులో ఇంతపెట్టుకుని గవర్నమెంట్ కోడలా? అంటూ కౌగిలించుకుంటున్నారన్నమాట.. చెప్తా మీ సంగతి అని అంటుంది. మా ముగ్గురిలో మీకు ఇష్టమైన ముద్దుల కోడలు ఎవరు? అని అడుగుతుంది నర్మద. నర్మద, శ్రీవల్లి కంటే ప్రేమ అంటే కాస్త ఎక్కువ ఇష్టం.. నా ముద్దుల కోడలు అదే దాంతో వేదవతి.. ‘ఏ కన్ను అంటే ఏం చెప్తాం.. ముగ్గురు కోడళ్లూ ఒక్కటే’ అని అంటుంది వేదవతి. మెషీన్ అరుస్తోంది అక్కడా.. నిజం చెప్పండి అని అంటుంది నర్మద. దాంతో వేదవతి.. ‘అంటే అన్నానని అంటారు కానీ.. ప్రేమ అంటే కాస్త ఎక్కువ అని అంటుంది. మెషీన్ ఆల్ రైట్ అనేసరికి.. నర్మద, శ్రీవల్లిలు అలుగుతారు. నర్మద మూతి తిప్పుతుంది. ‘అది ఎంతైనా నా మేనకోడలు కదా.. దాన్ని చిన్నప్పుడే ఎత్తుకోవాలని అనుకున్నా కానీ.. కుదర్లేదు.. అందుకే ఇష్టం అని అంటుంది వేదవతి. ‘అయితే ఇప్పుడు ఎత్తుకోండి.. మీదీ మీదీ రక్త సంబంధం కదా.. మేం బయటవాళ్లం కాబట్టి.. పరాయి వాళ్లమే’ అని నోరేసుకుని పడిపోతుంది శ్రీవల్లి. దాంతో ధీరజ్.. ‘అదేంటి చిచ్చు వదినా.. నువ్వు మౌనవ్రతం కదా.. ఎందుకు మాట్లాడుతున్నావ్’ అని అంటాడు. అక్కా నువ్వు ఎన్నో నెల.. ‘నాలుగూ’.. దొరికిపోయిందిగా దెబ్బకి నోరెళ్ల బెడుతుంది శ్రీవల్లి. నీ మౌన వ్రతం భంగం అయిపోయింది కానీ.. రా రా.. వచ్చి ఇలా కూర్చో అంటూ బల్లిని బలవంతంగా అక్క కూర్చోబెట్టి.. మెషీన్ కనెక్ట్ చేస్తారు. ఇదిగో బల్లక్కో.. నువ్వు అబద్దం చెప్పావే అనుకో.. మెషీన్ ఇట్టా కనిపెట్టేస్తుంది. జాగ్రత్తగా సమాధానం చెప్పాలి.. నీకు ఎన్నో నెల అని అడుగుతుంది నర్మద. మెషీన్ రాంగ్ అని అరిచేసరికి.. అంతా షాక్ అయిపోతారు. నిజం చెప్పు బల్లక్కా అని ప్రేమ ఫైర్ అవుతుంది. నాకు తెలియదూ.. గుర్తు లేదు అని అంటుంది శ్రీవల్లి. సరే నువ్వు ఇప్పటి వరకూ హాస్పిటల్‌కి ఎన్నిసార్లు చెకప్‌కి వెళ్లావ్ అని అడుగుతుంది. మూడు సార్లు అనేసరికి.. అప్పుడు కూడా రాంగ్ అని చెప్తుంది మెషీన్. దాంతో వేదవతి.. అదేంటి? అన్నీ తప్పనే చెప్తుంది. నువ్వు ఒక్కసారి కూడా హాస్పిటల్‌కి వెళ్లలేదా? మరి మందులు ఎలా వేసుకుంటున్నావే అని వేదవతి అడిగితే.. సుక్కూ తెచ్చింది అని అంటుంది శ్రీవల్లి. మరి వేదవతి రియాక్షన్ ఏంటో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.