
విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
‘ఈ ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా నెల్లూరు జిల్లా గూడూరులో 40 మి.మీ., పల్నాడు జిల్లా నెమలికల్లులో 25.మి.మీ., తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.2 మి.మీ., శ్రీసత్యసాయి జిల్లా రత్నగిరి, అనంతపురం జిల్లా హంపాపురంలో 22.మి.మీ. వర్షపాతం నమోదైంది’ అని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.